మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఉదయం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉదయగిరి వరకు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. ఈ అంతిమ యాత్రలో నేతలు, మంత్రులతో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉదయగిరికి చేరుకొని దివంగత మేకపాటి గౌతం రెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో గౌతం రెడ్డికి అంత్యక్రియలను నిర్వహించారు.