★ నేడు ప్రజాదీక్ష చేపట్టనున్న అమరావతి రైతులు.. వెలగపూడిలో 24 గంటల పాటు రైతుల సామూహిక నిరాహార దీక్ష.. ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు దీక్ష.. రాజధాని ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా దీక్ష
★ ఏపీలో జిల్లాల విభజనపై నేడు రెండో రోజు కలెక్టర్లతో ప్రణాళిక శాఖ సమావేశాలు.. జిల్లాల విభజనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలపై చర్చ
★ తూ.గో.: నేడు బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమం.. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటా నిధుల విడుదలకు డిమాండ్.. పాల్గొననున్న సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు
★ హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజుల పాటు బయో ఆసియా సదస్సు… వర్చువల్ విధానంలో జరగనున్న సదస్సు
★ ఈరోజు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం
★ నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20, రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం