ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన భౌతికకాయాన్ని నిన్న హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో అంత్యక్రియలు జరగనున్నాయి. నెల్లూరు నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయింది. జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం, డిసీ పల్లి, మర్రిపాడు, బ్రాహ్నణపల్లి మీదుగా ఉదయగిరికి అంతిమయాత్ర చేరుకోనుంది. ఉదయగిరిలో జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనబోతున్నారు. కాగా, మేకపాటి గౌతం రెడ్డి అంతిమ యాత్రలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గోవర్థన్ రెడ్డి, సంజీవయ్యలు పాల్గొన్నారు.
Read: Ukraine Crisis: ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం… అప్రమత్తమైన ప్రపంచదేశాలు…