రాయలసీమలో కీలక రాజకీయ నేతల్లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఒకరు. అయితే ఏపీలో ఇటీవల చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై బైరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయని.. అందువల్ల రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దగా ఉంటుందని బైరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఆయన ఖండించారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని, ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. Read Also: ఉద్యోగులతో…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం కనుచూపు మేర ఉద్యోగులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ ఉద్యమంలోనూ ఇంతమంది పాల్గొన్న దాఖలాలు లేవు. పోలీసులు జిల్లాల్లోనే కొందరు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారు వేషాల్లో చలో విజయవాడకు ఉద్యోగులు తరలివచ్చారు. రైతులు, కూలీల వేషంలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు అనేక…
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజువారి కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,040 శాంపిల్స్ పరీక్షించగా.. 5,983 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 11 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 11,280 మంది కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం..…
ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. గురువారం నాడు అత్యవసరమైతే తప్ప ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది విజయవాడకు చేరుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.…
ఏపీ ఉద్యోగులు పిలుపునిచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలు పడ్డాయని.. వాళ్ల సమస్యలపై ఆందోళనలకు దిగే బదులు ప్రభుత్వం చర్చలకు రావొచ్చని సజ్జల సూచించారు. ఉద్యోగుల కార్యాచరణను ఇప్పటికే వాయిదా వేసుకోవాలని కోరామని.. ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రేపు విజయవాడలో ఉద్యోగులు చేసేది ముమ్మాటికీ బలప్రదర్శనే అని…
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు.…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటాకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై భిన్నవాధనలు వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారం కోర్టు మెట్లుఎక్కిన విషజ్ఞం తెలిసిందే కాగా.. చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ స్పందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లొదొడ్డిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తొలుత బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు కల్లు తాగడానికి వెళ్లారు. అయితే వారు కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Read Also: ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు: సోము వీర్రాజు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి…