కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తరహాలో ఆశాజనకంగా ఉంటుందని భావించామని.. కానీ అలా లేదని తెలిపారు. పైకి అంకెలు చూడటానికి బాగున్నా బడ్జెట్ అంత ఉపయోగకరంగా అనిపించడంలేదని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతుందన్నారు. పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లేనని పెదవి విరిచారు. ఈ ఏడాది ఆర్థిక లోటు 6.4 శాతం ఉండొచ్చని కేంద్రమంత్రి…
పీఆర్సీ అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు జరిగిన చర్చల్లో మూడే అంశాలు చెప్పామని, మంత్రుల కమిటీ కొంత సమయం తర్వాత అభిప్రాయం చెప్తామని తమను మభ్యపెట్టిందని… సాయంత్రానికి తమ డిమాండ్లు సాధ్యపడవు అని ఒక సందేశంలో రూపంలో పంపిందని బండి శ్రీనివాసరావు తెలిపారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనందున ఈనెల 3న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను భయపెట్టవద్దని,…
ఏపీలో జగనన్న గోరుముద్ద పథకంలో అవినీతి జరిగిందన్న టీడీపీ నేతల ఆరోపణలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. ద్యార్థులకు ఇచ్చే చిక్కి కోసం రూ.350 కోట్లు వెచ్చిస్తున్నామని, గ్లోబల్ టెండర్ ప్రకారమే వీటి సరఫరా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. నాణ్యతను కూడా టాటా కన్సల్టెన్సీ లాంటి ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చామని మంత్రి సురేష్ తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదనే విషయాలను ప్రతిపక్షాలు గుర్తించాలని హితవు పలికారు.…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది. Read Also: పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: సజ్జల ఆర్టీసీ ఎండీ…
ఏపీలో పీఆర్సీపై జారీ చేసిన కొత్త జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలకు చెందిన స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారని ఆయన తెలిపారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయని, ఇది సానుకూల పరిణామం అన్నారు. పీఆర్సీ అమలు విషయంలో చర్చల పరంగా మరింత ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు గతంలో ఇచ్చిన డిమాండ్లలో ఒకటి ఇక వర్తించదని… ఎందుకంటే ఇప్పటికే…
ఏపీలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఫిబ్రవరి 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. తొలుత ప్రభుత్వం జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. ఆ గడువు సోమవారంతో ముగియడంతో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. Read Also: ఇండిగో కీలక నిర్ణయం……
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైకు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఇండిగో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అధికారులు అవకాశం కల్పించారు. Read Also: ఏపీలో కార్యాలయం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే? తాజా ఒప్పందం దృష్ట్యా వయబిలిటీ గ్యాప్…
వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తోన్న ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చర్చల ద్వారా సమ్మెకు వెళ్లకుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ఆర్ధికశాఖ…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఏపీ, తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నాయి పాజిటివ్ కేసులు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,284 శాంపిల్స్ పరీక్షించగా.. 5,879 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇదే సమయంలో.. 11,384 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 3,24,70,712…