Bheemla Nayak: థియేటర్ యాజమాన్యం కక్కుర్తి.. టిక్కెట్‌తో పాటు కూపన్ కొనాలంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. భీమ్లానాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కొందరు థియేటర్ యజమానులు కక్కుర్తికి తెర తీశారు. నెల్లూరులోని స్పైస్ సినిమా థియేటర్ నిర్వాహకులు ప్రస్తుతం ఇదే పనిలో పడ్డారు. తమ థియేటర్లో భీమ్లా నాయక్ సినిమా చూడాలంటే సినిమా టిక్కెట్‌తో పాటు ఫుడ్ కూపన్ కూడా కొనాల్సిందేనని షరతు పెట్టారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా టిక్కెట్ కోసం వస్తే ఇదేం బాదుడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా టిక్కెట్ రూ.250 అని.. ఫుడ్ కూపన్ రూ.120 అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సినిమా టికెట్ కొన్నవాళ్లు టికెట్ తోపాటు ఫుడ్ కూపన్ కూడా వాట్సప్ గ్రూపుల్లో పెడుతూ థియేటర్ నిర్వాహకులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా.. స్పైస్ థియేటర్ వారు ఇలా కూపన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుండటం విచిత్రంగా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!