Brother Anil Kumar: ఉండవల్లితో సుదీర్ఘ భేటీ.. రహస్య విషయాలపై చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్టుండి సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు.. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.. అయితే, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినా.. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతాననడం ఆసక్తికరంగా మారింది.. కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.. పార్టీపరంగా, కుటుంబ పరంగా ఉండవల్లి సలహాలు ఇచ్చారని… రాజకీయ జ్ఞానం నేర్చుకోవడం కోసమే తాను ఉండవల్లి దగ్గరకు వచ్చానని.. ఉండవల్లి జ్ఞానం నచ్చిందని పేర్కొన్నారు.
Read Also: Russia Ukraine War: ఒంటరై పోయామంటూ అధ్యక్షుడి ఆవేదన
Also Read
ఇక, ప్రజలకు మంచి చేయడమే నిజమైన రాజకీయం అని అభిప్రాయడ్డారు బ్రదర్ అనిల్.. నేను ప్రభువును నమ్ముకున్నాను, దేవుడు చెబితే కానీ ఏది చేయనన్న ఆయన.. తమ కుటుంబం ఎప్పుడో రాజకీయాల్లో ఉందన్నారు.. రాజకీయం అనేది పెద్ద వ్యవస్థ అని కామెంట్ చేశారు.. అయితే, ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలు త్వరలో బయటపెడతామని.. కుటుంబానికి, రాజకీయాలకు సంబంధించిన రహస్య విషయాలు చర్చకు వచ్చాయంటూ కామెంట్ చేసి ఆసక్తిపెంచేశారు బ్రదర్ అనిల్.. తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన బ్రదర్ అనిల్ భార్య వైఎస్ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే.. ఇక, ఈ భేటీ సందర్భంగా విభజన కథ బుక్‌ను బ్రదర్ అనిల్ కుమార్‌కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చారని తెలిపారు..
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!