తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈనెల 2న కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను వారు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని.. గత నెలలో అతడు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో గొడవ జరిగిన కారణంగా గ్రామ పెద్దలు…
ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షల షెడ్యూల్‌ను నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని సమాచారం. అలాగే ప్రీఫైనల్ పరీక్షలను ఈనెల 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించాలని…
★ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్★ నేడు, రేపు తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన… సాయంత్రం తిరుమల చేరుకోనున్న వెంకయ్యనాయుడు.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి★ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని నేడు విజయవాడ ధర్నా చౌక్‌లో టీడీపీ నేత బోండా ఉమా దీక్ష.. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్న బోండా ఉమా★ రాష్ట్ర విభజన అంశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై…
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ పెరుగుతోంది… టీడీపీకి కూడా దీనిపై ఉద్యమానికి సిద్ధం అవుతుంది.. రేపు వేలాది మందితో ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు.. ఈ సందర్భంగా వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఉమ… రంగా కుటుంబ సభ్యులు కూడా వారి సన్నిహితులైన కొడాలి నాని, వంశీమోహన్ ద్వారా ఈ జిల్లాకు రంగా పేరు పెట్టాలని…
ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించాలని.. ఈ విషయంలో పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టిపెట్టాలని లేఖలో కోరారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే హెచ్ఆర్ఏను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Read Also: ఎర్రజెండా వెనుక పచ్చజెండా…
జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కొందరు కోర్టుకు వెళ్లారని.. పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతిస్తున్నారని జగన్ ఆరోపించారు. అయితే ఎర్రజెండా వెనుక పచ్చజెండా అజెండా ఉందని జగన్ విమర్శించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు అని.. కానీ చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే సమ్మెలు, ఆందోళనలు చేయడం…
కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది… ఘాటు విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి.. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ.. ఇక, డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత…
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది… విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యులు బోండా ఉమ.. దీని కోసం ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు.. రేపు ధర్నా చౌక్ వద్ద రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో వేల మందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు.. అవసరతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమన్నారు.. వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదన్న ఆయన.. రంగా వంటి…
ఏపీలో జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ పథకంలో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు రూ.285.35 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. Read Also: మహేష్‌బాబుతో…