ఏపీలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కాగా ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను…
ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం…
ఏపీలో పీఆర్సీ అంశం ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ఏం చర్చించిందో అర్థం కావడం లేదని.. అశుతోష్ మిశ్రా రిపోర్టు చూపించలేదని, నూతన పీఆర్సీ జీవోలు రద్దు చేయలేదని ఏపీటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. Read…
పెళ్లంటే బాజాలు, భజంత్రీలు, డ్యాన్సులు, హంగామా ఉంటుంది. వీటి గురించి మనుషులకు తెలుసు. కానీ ఆవులు,గేదెలు, ఎద్దులకు తెలియదు. కొన్ని ఎద్దులు డప్పు శబ్దానికి బెదిరిపోయి పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లాలోని రామళ్లకోట గ్రామంలో ఓ పెళ్లి తంతు జరుగుతున్నది. బాజాభజంత్రీలతో పెళ్లి ఊరేగింపు ముందు వెళ్తుండగా వెనుకనుంచి కాడెద్దులు బండితో సహా పరుగులు తీశాయి. ఈ బండి పెళ్లి ఊరేగింపు మీద నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో…
టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే…
పీఆర్సీ సాధన సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. కానీ, ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వ ప్రతిపాదనలకు తల ఊపిరావడంపై కొందరు ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు చర్చలు విఫలం అయ్యాయి.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.. కలసివచ్చేవారితో ఉద్యమం ఉంటుందంటున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై కొందరు ఉద్యోగులుమండిపడుతున్నారు.. ఏకంగా పీఆర్సీ సాధన సమితి నాయకులకు పుష్పంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారంటే.. వారు…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదానికి తెరపడింది.. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి.. ఇక, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉన్న దాంట్లో మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారన్న ఆయన.. అదనంగా భారం అయినా కూడా అధికారులు సీఎంతో మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేశామన్నారు.. ఇంకా కొన్ని కోరికలు ఉన్న కూడా భవిష్యత్ లో దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.. Read Also: యాదాద్రికి…
ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రుల కమిటీతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సీఎం జగన్ మనసు విప్పి మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని సీఎం జగన్ కోరారు. తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. ఉద్యోగులు లేకపోతే తాను లేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి…
ఏపీలో ఎట్టకేలకు పీఆర్సీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. నిన్న, ఈరోజు రెండు రోజుల పాటు సుమారు 10 గంటల పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం సాగింది. ఉద్యోగ సంఘాల ప్రధాన అంశాలు హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: ఫిట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసిన…