రాష్ట్ర విభజనపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ప్రధావి మోడీవి పనికిమాలిన కూతలుగా పేర్కొన్న ఆయన.. దేశానికి ప్రధానిగా ఇలా మాట్లాడతారా ? అని నిలదీశారు… తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పుడు మళ్లీ అసందర్భంగా మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు.. ఇక, విగ్రహావిష్కరణ కోసం…
భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రోల్ మోడల్‌గా పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రెడ్డప్ప… ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏడాదికి 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించిన ఆయన.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.. ఇక, రైతులకు, కౌలుదారులకు ఏడాదికి రూ. 13500 రైతు భరోసా కల్పిస్తున్నారని వెల్లడించారు.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కేంద్ర…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య పైకి కిందికి కదులుతూనే ఉంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,522 శాంపిల్స్ పరీక్షించగా 1,679 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు కన్నుమూశారు.. ఇదే సమయంలో 9,598 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. Read Also: Narayana: చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు..! ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం.. ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమగా మారింది.. కొందరు స్టార్లు ఓపెన్‌గా ప్రభుత్వాన్ని విమర్శంచడంతో ఇది మరింత రచ్చ రచ్చ అయిపోయింది.. కొందరు సినీ పెద్దలు రంగంలోకి దిగి ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సూచించారు.. ఇక, మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఏకాంతంగా సమావేశం అయ్యారు.. ఎవ్వరూ లేకుండా ఆయన ఒక్కరే వెళ్లడాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర జరుగుతోందని.. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనని…
విశాఖలోని శారదా పీఠం వద్ద మంత్రి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు శారదా పీఠం వద్దకు చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని సీఐ స్పష్టం చేశారు. Read Also: Bonda Uma: సీఎం జగన్ ఇంటిని…
జిల్లాల విభజన నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద బోండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు. అధికారం చేతిలో ఉందని జగన్ ప్రభుత్వం ఇష్టం…
శ్రీశైలం జలాశయానికి సంబంధించి తాగునీటి అవసరాలను పక్కనపెట్టి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. తాగు, సాగు నీటి అవపరాలు తీరినప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టేశాయి. ఫలితంగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 35 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి నిల్వలు పడిపోయాయి. Read Also: రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇకపై…
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతున్న మహిళపై ఎదురింట్లో నివాసముండే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే భర్తను అడ్డుకోవాల్సిన భార్య ఆ పని చేయకుండా… ఈ పాడు పనిని వీడియో తీయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు దిలీప్ అని.. వీడియో తీసిన అతడి భార్య తులసి అని పోలీసులు వెల్లడించారు. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ…
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన నోట్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నోట్‌ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30వేల మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రానుంది. Read Also: రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అటు రాష్ట్రంలో కొత్తగా…