ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న కారణంతో ఓ సినిమా థియేటర్ను తహసీల్దార్ సీజ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సినిమా థియేటర్ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్కు లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాసమహల్ థియేటర్ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తహసీల్దార్ ప్రకటించారు. అయితే తహసీల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్రావు హైకోర్టును ఆశ్రయించాడు. Read Also: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.26వేల కోట్లతో…
రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అరసవల్లి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నామని… దీనిపై పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి వున్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇక, అరసవల్లి సూర్యదేవుని జయంతి ఉత్సవాలును అధికారులు విజయవంతంగా నిర్వహించారిన ప్రశంసించారు.. మరోవైపు ముఖ్యమంత్రి…
సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు ధర పెంచినట్లు సిమెంట్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ఆధారంగా రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. సిమెంట్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇల్లు కట్టుకోవాలంటే పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.…
ఏపీలో మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 4 లేదా 7న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం. ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. ఉగాదికి ఇంకా…
విశాఖలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,264 కోట్లతో ఆధునీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష కూడా చేపట్టారు. అటు హిందూపురం కేంద్రంగా జిల్లా కోసం ఆమరణ దీక్షకు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలతో నేరుగా ప్రజల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పటికే గనన్న చేదోడు పథకం కింద రాష్ట్రంలోని దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. వరుసగా రెండో ఏడాది నగదును ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రెండో విడతలో రూ.285 కోట్లను విడుదల చేసేందుకు సిద్ధం…
★ ఏపీలో నేడు జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులు విడుదల… 2.85 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.285 కోట్లు జమచేయనున్న సీఎం జగన్.. రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం★ నేడు తిరుమలలో రథసప్తమి వేడుకలు.. సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు★ కడప: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ నేడు ఆందోళనలు… జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు★ నేడు హైదరాబాద్ రానున్న కేంద్ర…
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. జిల్లాలోని ఊరుకొండ సమీపంలో ఇన్నోవా వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు.. వివాహ వేడుక కోసం బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.. అయితే, ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. ప్రమాదంలో మరణించిన వాళ్లలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల…
సమాజంలో మార్పు రావాలంటే.. పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే అది సాధ్యం అవుతుందన్నారు స్వామి పరిపూర్ణానంద.. శ్రీకాకుళంలో జరిగిన సమాలోచన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. దేశభక్తి పెంపొందించాలంటే బాబర్, హుమయూన్, ఖిల్జీల చరిత్ర పాఠ్యంశాలలో చించేయాలన్న ఆయన… అశోకుడు, రాణాప్రతాప్, శివాజీ, వివేకానందుడి చరిత్ర నాన్ టేయిల్లో పెట్టాలని కోరారు.. ఇక, సన్యాసులు వేదాంతం చెప్పడమే కాదు.. సమూలమైన మార్పుకి దోహాదపడాలని సూచించారు పరిపూర్ణానంద..…