అమూల్ సంస్థ పాల ధరలను మరోసారి పెంచింది. తన అన్ని రకాల పాల ధరలను పెంచుతున్నామని సోమవారం ప్రకటించింది. లీటర్ పాలపై రూ.4 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. మరోవైపు అమూల్ తాజా…
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో తిరునాళ్ల ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రభల వేడుక కన్నులపండువగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రభలు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు చేశారు. నరసరావుపేట నుంచి నుంచి వచ్చే భక్తులు ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మార్గంలో కొండకు చేరుకుని నాగిరెడ్డి గెస్ట్‌హౌస్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని తెలిపారు. నరసరావుపేట నుంచి…
ప్రసిద్ధ శైవక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పాతాళ గంగలో నీటిమట్టం భారీగా తగ్గిపోయింది. మెట్ల కిందకు నీటిమట్టం పడిపోవడంతో భక్తులకు నీటికొరత ఏర్పడింది. దీంతో భక్తులు స్నానాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రద్దీ దృష్ట్యా వసతి సౌకర్యం లేకపోవడంతో భక్తులు రోడ్ల మీదే సేద తీరుతున్నారు.…
భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేస్తున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. టిక్కెట్ రేట్లు కావాలనే పెంచకపోవడం, అదనపు షోలకు అనుమతులు ఇవ్వకపోవడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇలా పలువురు నేతలు పవన్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. జగన్ హీరోగా సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన…
ఏపీలో మరోసారి ఎన్నికల సందడి కనిపించబోతోంది. ఈ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో తాజాగా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. మార్చి 24న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపింది ఈ ఉప ఎన్నికకు…
ఏపీ వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 7న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో…
అమరావతి: టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యను గతంలో తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని.. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనమయ్యారని విమర్శించారు. వివేకా…
ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన పక్రియపై ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ స్పందించారు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించామని.. వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నాయో.. ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష…
రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ‘జగనన్న తోడు’ మూడో విడత కింద లబ్ధిదారులకు ఈరోజు సొమ్ము విడుదల చేయనున్నారు.. జగనన్న తోడు పథకం మూడో విడత సొమ్ము ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా… మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో వాయిదా వేశారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఇవాళ 5.10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు.. తొలి విడతలో 5.35 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన.. సీపీఐ నారాయణ ఓ వింత జంతువు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తానో జాతీయ నాయకుడట.. రెండు ఎంపీ సీట్లు ఉన్న సీపీఐ జాతీయ పార్టీ అయితే.. మాకు 28 మంది ఎంపీలు ఉన్నారన్నారు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో వైఎస్ జగన్ కుటుంబం…