ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కాగ్ నివేదిక ఆధారంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కాగ్ నివేదిక ఆధారంగా యనమల చేసిన విమర్శలను తిప్పిగొట్టిన ఆయన.. వివిధ పద్దుల్లో అవకతవకలున్నాయని యనమల విమర్శించడం అన్యాయం అన్నారు.. రూ.48 వేల కోట్ల అవినీతి అంటూ యనుమల అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. నిధుల వినియోగం పై కాగ్ అడిగిన అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని.. రూ.48,500 కోట్ల మేరకు “బుక్ అడ్జస్ట్మెంట్స్” జరిగాయన్నారు.. “బుక్ అడ్జస్ట్మెంట్స్” లో అవకతవకలు ఎలా జరుగుతాయి? అని ప్రశ్నించారు.. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో కూడా సుమారు 98 వేల “బుక్ అడ్జస్ట్మెంట్స్” ఎంట్రీలు జరిగాయు. మరి దీన్ని ఏమనాలి….!? అంటూ నిలదీశారు బుగ్గన.
Read Also: Vizag Steel Plant: విశాఖ ఉక్కును అమ్మి ఏపీని బలి చేస్తారా..?
సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి కూడా గత ప్రభుత్వం సరైన రీతిలో కేంద్రం నుంచి ఆర్దిక సహాయాన్ని తెచ్చుకోలేక పోయిందని ఆరోపించారు మంత్రి బుగ్గన.. మా ప్రభుత్వం కేంద్రం నుంచి గ్రాంట్లు తెచ్చుకుంటే మీకు ఇబ్బందేమిటి..? మీకు చేతకాలేదు.. కదా అని ఎద్దేవా చేసిన ఆయన.. మేం తెచ్చుకుంటే మా ప్రభుత్వం పై విమర్శలా..!? అని మండిపడ్డారు.. తన విమర్శలపై యనమల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. యనమల అన్యాయంగా విమర్శలు చేశారు తప్పితే, సహేతుకమైన విమర్శలు కానేకావన్న ఆయన.. 2019లో ఆర్ధిక వ్యవస్థకు గుండెకాయ లాంటి సీఎఫ్ఎంఎస్ ను గత చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తిని సీఈవోగా నియామకం చేసిందన్నారు.. వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్ధ కు ఒక ఐఎఎస్ అధికారిని సీఈవోగా నియమించాం.. గత ప్రభుత్వ హయాంలో రూ. 82వేల కోట్లు కనపడని ఖర్చు జరిగింది.. దానికి ఏం సమాధానం చెబుతారు.. అని నిలదీశారు. రాష్ట్రంలో పేదలకోసం పెద్దమొత్తంలో గ్రాంట్లు తెచ్చుకుంటే టీడీపీ నేతలకు కంటగింపుగా ఉందని మండిపడ్డ ఆయన.. మా ప్రభుత్వం పేదలకోసం అప్పు చేస్తే, టీడీపీ ప్రభుత్వం కత్తెర, దువ్వెనలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు తగ్గించి పేదవాడి అభ్యున్నతికోసం ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఆర్ధిక ఎమర్జన్సీ పెట్టాలని డిమాండ్ చేశారు. దానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చామని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జన్సీ పెట్టాలన్న ఆయన.. సీబీఐ విచారణ జరిపించాలన్న యనమలకు కౌంటర్ ఇస్తూ.. “ఓటుకు నోటు కేసు”లో ఇరుక్కుని కేంద్రం దగ్గర రాష్ట్రప్రయోజనాలు తాకట్టు పెట్టినందుకు ఎమర్జన్సీ పెట్టాలా? అంటూ సెటైర్లు వేశారు.. ఇక, ఓటుకు నోటు కేసును సీబీఐ విచారణకు పెడదామా ? అని సవాల్ చేశారు.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టులు, ఒప్పందాలు, పథకాల పై సీబీఐ విచారణ పెడదామా? అని ప్రశ్నించారు మంత్రి బుగ్గన.