నేడు రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండవ విడత చర్చలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాల అమలులో భాగంగా చేపడుతున్న సంస్కరణలు పరిశీలించేందుకు ఓడీఎఫ్ కేంద్ర బృందం కాకినాడలో పర్యటన. నేడు అమరావతిలో అమరేశ్వర స్వామి రథోత్సవం. నేడు మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి రథోత్సవం, పాల్గొనున్న నారా లోకేష్. నేడు టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వులు. యడ్లపాటి అంత్యక్రియలకు హాజరుకానున్న టీడీపీ…
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదివే పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకు ఒక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది యువకుడు ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… రాయవరం మండలం పసపూడికి చెందిన ఒకరు వ్యవసాయ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్న ఆయన కుమారుడు సెలవు రోజున ఇంటికి వచ్చాడు. తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులపై…
ఏపీలో రాజకీయం ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూ నడుస్తోంది. వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ హస్తం ఉండొచ్చని వివేకా అల్లుడు రాజశేఖర్ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ టీడీపీ నేత చంద్రబాబు చేతిలో పావులుగా మారారని ఆయన ఆరోపించారు. దీంతో సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి…
ఈనెల 3న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పెద్దకర్మ దృష్ట్యా ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని మార్చి 7వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆ రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్ర…
వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని.. ఈ కుట్ర ఇప్పుడు పరాకాష్టకు చేరిందని సజ్జల వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబాన్ని ఇరికించేలా పూర్తిగా రాజకీయపరమైన కుట్రను ఒక ముఠా…
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు బైపాస్ రోడ్డులోని ఉడ్ కాంప్లెక్స్ శివారులో పార్కింగ్ చేసి ఉన్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో తొలుత మంటలు చెలరేగగా.. ఆ మంటలు నెమ్మదిగా పక్కన ఉన్న బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా…
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి చర్చగా మారింది.. ఈ కేసులో సీబీఐకి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.. ఇక, ఆమె అవినాష్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో.. వాంగ్మాలంలో సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడం పెద్ద చర్చకు దారి తీసింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు…
మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది.. ఇక, మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ‘పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి.. ఈ పరమ పవిత్రమైన రోజున ముక్కంటి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్…
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌గా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కాగా వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జిగా తనను నియమించినందుకు సీఎం జగన్‌కు ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా…
ఓటీఎస్ పథకంపై ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం…