నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బీ ఫార్మసీ విద్యార్థుల నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్(28)కు వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులో ఉంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలీసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆరునెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని…
విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం మరో రికార్డు సృష్టించింది… కరోనా మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు.. హుండీ ఆదాయం కూడా తగ్గిపోయిన విషయం తెలిసిందే కాగా.. మళ్లీ అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో.. ఇప్పుడు క్రమంగా భక్తుల సంఖ్యతో పాటు.. హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది… ఈ నేపథ్యంలో… శుక్రవారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది.. Read…
★ శ్రీశైలంలో ఐదోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు… సాయంత్రం ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ.. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవ★ ఈరోజు మధ్యాహ్నం ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి రానున్న 22 మంది తెలుగు విద్యార్థులు.. బుకారెస్ట్ నుంచి ఢిల్లీ రానున్న 13 మంది.. బుకారెస్ట్ నుంచి ముంబై రానున్న 9 మంది తెలుగు విద్యార్థులు★ ఢిల్లీ: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం, ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై…
ఏపీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. తమ హీరో సినిమా చూద్దామని వెళ్తుంటే థియేటర్లు మూసి ఉండటం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. టిక్కెట్ రేట్లపై కొత్త జీవో రాకపోవడంతో జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ముఖ్యంగా సి, డి సెంటర్లలో థియేటర్ల యజమానులు లబోదిబోమంటున్నారు. రూ.20, రూ.15, రూ.5 రేట్లకు తాము టిక్కెట్లను విక్రయించి నష్టపోలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది… భారత్‌కు చెందిన వారు దాదాపు 20 వేల మంది ఉన్నారని కేంద్రం తేల్చింది.. అందులో 4 వేల మంది వరకు ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మిగతావారిని రప్పించే ప్రయత్నాల్లో ఉంది.. భారత ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉండడంతో.. ప్రత్యేకం హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై సీఎం…
టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో తాను తాండూరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు.. పార్టీ నాకే టిక్కెట్ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అంతేకాదు.. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఐదేళ్లు పదవిలో ఉంటారని.. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు..…
ఏపీ టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మొండి వైఖరిపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై పెదవి విరుస్తుండగా, తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. “భీమ్లా నాయక్” సినిమా విషయంలో జగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందని మండిపడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వరుస ట్వీట్లు చేశారు. Read Also :…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నాడు చంద్రబాబు సర్పంచుల అవగాహన సదస్సులో పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విధిస్తోన్న పన్నులు వంటి పలు అంశాలపై చంద్రబాబు విమర్శలు చేయడం, చెత్తపన్ను వసూలు చేయబోమని పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించడం వంటి అంశాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘చంద్రబాబు గారు సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్…