దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజా మూవీ ఆర్ఆర్ఆర్.. ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ కొత్త జీవోను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు దర్శకుడు రాజమళి, నిర్మాత డీవీవీ దానయ్య.. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య.. మీడియాతో మాట్లాడారు.. సీఎం వైఎస్ జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్…
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.. ఇక, ఏపీలో ఇప్పటి వరకు టికెట్ల వివాదం కొనసాగగా.. తాజాగా ప్రభుత్వం ఆ వివాదానికి తెరదింపుతూ.. జీవో విడుదల చేసింది.. అందులో కొన్ని షరతులు కూడా పెట్టింది.. ఇప్పటికే చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన దర్శకుడు రాజమౌళి.. ఇవాళ ఆర్ఆర్ఆర్ మూవీ నిర్వాత డీవీవీ దానయ్యతో కలిసి.. సీఎం వైఎస్…
అక్రమ లేఅవుట్లని తరచూ క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కల్పించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇవాళ విచారణ జరిగింది.. దువ్వాడు సాగర్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటీషన్ పై విచారణ సాగింది.. తెలంగాణలో అక్రమ “లేఅవుట్లు”లో ప్లాట్ల రిజస్ట్రేషన్‌ను అనుమతిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది.. తెలంగాణలో అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరించాలని 20 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయస్థానం దృష్టికి…
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించింది ప్రభుత్వం… ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో… గౌత్రెడ్డి శాఖలను ఇతర మంత్రులుకు కేటాయించిన విషయం తెలిసిందే.. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజేస్,…
ఏపీ అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. వారిని సభ నుంచి…
ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రగడ జరుగుతోంది. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు ఇచ్చిందో లేదో కానీ లిక్కర్ మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ATM (ఎనీ టైమ్ మందు) అనేలా చంద్రబాబు పాలన సాగిందని…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మద్యపాన నిషేధం గురించి…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం కొనసాగనున్నాయి. ఈరోజు బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ జరగనుంది. అటు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల బిల్లుతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ పెంపు బిల్లు, మద్యం అమ్మకాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాల తీర్మానంపై జరిగే చర్చలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా అసెంబ్లీలో నేడు జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ వాయిదా తీర్మానం…
ఏపీలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ కార్మికులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎల్పీవో, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేయవద్దని కలెక్టర్లు ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి స్కానింగ్ ప్రతులను ఉ.10:45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని, హెడ్క్వార్టర్లు విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశించారు. మరోవైపు…