విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు సబ్సిడీ ఇచ్చినా వాడుకోలేకపోయారని దుయ్యబట్టారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక, పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు సోము వీర్రాజు.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
Read Also: Omicron variant XE: ఒమిక్రాన్ ఎక్స్‌ఈ కలకలం.. గుజరాత్‌లోనూ వెలుగు చూసింది..!
డబ్బు మాకిస్తే పరిపాలచేస్తామని స్పీకర్ అంటున్నారు.. మేం డబ్బులు ఇస్తామంటేనే మీరు ఎన్నికల్లో గెలిచారు..? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. కేంద్రం నిధులు ఇవ్వకపోతే స్పీకర్ ఆముదాలవలసకు వెళ్లే రోడ్డు ఎలా వచ్చింది…? అని నిలదీశారు. పంచాయితీ నిధులను ముఖ్యమంత్రి పక్కదారి పట్టించారని ఆరోపించారు. విశాఖలో 22(ఏ)భూములపై ఫ్యాన్ గ్రద్దలు వాళుతున్నాని విమర్శు గుప్పించారు.. ఉత్తరాంధ్ర ప్రజల వలసలకు ప్రదాన కారణం నీళ్లు, పంటలు లేకపోవడమేనన్న ఆయన.. ప్రాజెక్టుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది… మెయింటైనెన్స్ కోసం నిధులు ఇవ్వలేనివాళ్లు పోలవరం కట్టేస్తామంటున్నారని సెటైర్లు వేశారు. ఇక, మీడియం ఇరిగేషన్ కు మంత్రి లేడు, నిధులు లేవు అని.. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ నుంచి జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర ప్రారంభించామని తెలిపారు సోము వీర్రాజు.