ఈ నెల 11వ తేదీన కొత్త కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం జగన్ తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.. జిల్లాలు, సామాజిక సమీకరణలు, మహిళలు.. ఇలా అన్ని బేరీజు చేసేపనిలో ఉన్నారు.. అందరికీ మంత్రి పదవి కావాలని ఉన్నా.. అందరూ అధినేతపైనే భారం వేస్తున్నారు.. ఆశగా ఎదురుచూస్తున్నారు.. కేబినెట్ కూర్పు గురించి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు… కేబినెట్ కూర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం అన్నారు.. అసంతృప్తి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసిన ఆయన.. ప్రతి ఎమ్మెల్యే మంత్రి పదవిని ఆశిస్తారు.. కానీ, సామాజిక సమీకరణ, సమర్ధత, వచ్చే ఎన్నికల్లో గెలుపు అన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారని.. ముఖ్యమంత్రి నిర్ణయం శిరోధార్యం అన్నారు. పార్టీ, ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపించాలి.. వ్యక్తిగత నిర్ణయాలు, కోరికలు ఉండకూడదన్న ఆయన.. 2024కి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావటమే మా లక్ష్యం అని ప్రకటించారు.
Read Also: Kotamreddy: నాకు మంత్రి పదవి సీఎం జగన్ ఇష్టం.. ఆశావహుల జాబితాలో మాత్రం ఉన్నా..