ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన మరో విడత మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధం అయ్యారు.. రేపు సచివాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. Read Also: AICC: కాంగ్రెస్ ప్రక్షాళన.. అధిష్టానం కీలక ఆదేశాలు…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది.. దీనికి ప్రధాన కారణం.. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని సీఎం జగన్ చెప్పడమే.. ఇప్పటికే ఆ సమయంలో దాటడంతో.. ఇదో విస్తరణ..! విస్తరణ అప్పుడే అంటూ కథనాలు వస్తున్నాయి.. అయితే, వైసీపీఎల్పీ సమావేశంలో దానిపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తానని చెప్పానని గుర్తుచేసుకున్న ఆయన.. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు.. పార్టీ…
వైసీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారి పనితీరును కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామన్న ఆయన.. రాబోతున్నది పరీక్షా సమయం.. 2 సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోంది.. ప్రజలకు చేసిన మంచిని తీసుకుని వెళ్లలేకపోతే అది తప్పే అవుతుందన్నారు.. ఈవిషయాన్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదన్న ఆయన.. ఎవరు పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదని ష్పష్టం చేశారు.. సర్వేల్లో పేర్లు రాకపోతే కచ్చితంగా మార్పులు వస్తాయన్న ఆయన..…
వైసీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. మూడేళ్ల తర్వాత ఈ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగింది.. సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్.. ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణాలు, ఉద్దేశాలు ఉన్నాయన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పాటై 34 నెలలు కావొస్తోంది.. మరో 2 నెలల్లో మూడు సంవత్సరాలు కూడా పూర్తి కావొస్తోంది.. ఇక పార్టీ…
ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని…
ఏపీలో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు సోమవారం నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం…
సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో రెండుసార్లు జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ జవహర్‌నగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని తెలిపారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఒకే వ్యక్తికి అవకాశం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని సుమన్ అన్నారు. మరోవైపు…
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ వచ్చేసింది… గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగన జనసేన ఆవిర్భావ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వమంటూ స్పష్టం చేసిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాం.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాష్ట్ర అభివృద్ధికోసం పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆయన.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందనే…
జనసేన పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్నినాని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. పవన్ రాజకీయ ఊసరవెల్లి అన్నారు.. ఇక, అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కల్యాణ్ ఉండేవాడా? అంటూ…