తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. రికార్డు స్థాయిలో ఉష్ట్రోగ్రతలు పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయట అడుగుపెట్టడానికి భయపడి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల, రెంటచింతల ప్రాంతాల్లో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో కూడా 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఓవైపు ఎండలు మరోవైపు వడగాలులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఇక, మరో మూడు రోజులపాటు ఎండలు, వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండకు…
సోషల్ మీడియా ఇప్పుడు ఎంతో మందికి చేరువైపోయింది.. పిల్లలు, యూత్, పెద్దలు అనే తేడా లేకుండా అంతా సోషల్ మీడియాలో అడుగు పెడుతున్నారు.. యాక్టివ్‌గా ఉంటున్నారు.. అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇక, ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇలా.. ఎంతో మంది తమ కార్యక్రమాలు, కార్యాచరణ అన్నీ షేర్ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలను హ్యాకర్స్ బెడద వెంటాడుతూనే ఉంది.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల…
కడపలో ఈ రోజు రాయలసీమ రణభేరి సభ నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రణభేరి సభకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ వేదికపై రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టు సాధన కోసం వరుస ఆందోళనలు చేపట్టే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నారు. రాయలసీమ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేయనున్నారు. రాయలసీమ రణభేరి సభలో పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని…
నేడు కడపలో బీజేపీ బహిరంగసభ, రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ సభ, హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి, ఇతర రాష్ట్ర నేతలు. నేడు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక మ్యాచ్, ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు. పంజాబ్‌లో ఇవాళ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కేబినెట్ ప్రమాణస్వీకారం. ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు నిరసనలకు టీడీపీ పిలుపు, నాటుసారా నిషేధించాలంటూ టీడీపీ ఆందోళన. ఒంగోలు ఇవాళ్టి నుండి…
పెగాసెస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు డిమాండ్ చేశారని…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవటం పవన్ కళ్యాణ్‌కు అలవాటు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్కో ఎన్నికల్లో పవన్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడుతారని విమర్శించిన ఆయన.. అప్పుడు తిట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారని.. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పేదలకు ప్రభుత్వం…
కుల మతాలకతీతంగా సాంప్రదాయాలను పాటిస్తూ చేసుకునే పండగ హోలీ.. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూసే వారు చాలా మందే ఉంటారు. కానీ గత రెండేళ్లుగా ప్రజలు కోవిడ్ కారణంగా హోలీ జరుపుకోలేదు. ఈసారి పరిస్థితి మారింది. రంగులతో వీధులన్నీ సందడిగా మారాయి. ఇక, రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వసంత రుతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉల్లాసంగా…
నేడు రష్యా – ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు. నేడు దేశవ్యాప్తంగా హోలీపండుగ. శ్రీకాకుళం జిల్లా మడపాo గ్రామంలో నేడు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. విశాఖ ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణ. నేటి రాత్రి 7గంటల నుంచి ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ… మార్చి 23వ తేదీన విగ్రహప్రతిష్ట విశాఖ: సింహాచలం వరాహాలక్ష్మి నృసింహ్మస్వామి సన్నిధిలో డోలోత్సవం… నేటి నిత్య కళ్యాణం రద్దు.. అనంతపురం…
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. దీంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు. సినిమా రిలీజ్ కానున్న ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ప్రత్యేక ధరలు…
తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది. ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను ఈనెల 22 వరకు బుక్ చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపింది. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తామని టీటీడీ వివరించింది. ఈనెల 22న టిక్కెట్లు పొందిన వారికి వివరాలు పంపిస్తామంది. ఈనెల 20న ఆర్జిత…