రెండు రోజుల పాటు కడప, కర్నూలు జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఇవాళ సాయంత్రం కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన.. 5.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఇక, రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి.. రాత్రి 7.30 నుంచి 7.40 గంటల మధ్య కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు.. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. అనంతరం సీతారాముల కల్యాణ వేదిక వద్దకు చేరుకోనున్న ఏపీ సీఎం.. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరై… ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.. సీతారాములు కల్యాణాన్ని తిలకించనున్నారు.
Read Also: New Variants: కరోనా కొత్త వేరియంట్లు.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్..
ఇక, ఆ తర్వాత ఒంటిమిట్ట నుంచి రోడ్డు మార్గాన బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్.. రాత్రి 10.30 గంటలకు కడపలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.. రాత్రి అక్కడే బస చేస్తారు.. మరుసటి రోజు (శనివారం) ఉదయం 9.10 గంటలకు కడప ఎన్జీవో కాలనీలో నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఏపీ సీఎం.. అనంతరం ఉదయం 9.30 నుంచి 9.45 గంటల వరకు కడప నగర మేయర్ సురేష్‌బాబు కుమార్తె వివాహ ముందస్తు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఆ తర్వాత కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం జగన్.. ఉదయం 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు.. కర్నూలులో జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.