సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం మోపుతున్నాయన్నారు.. మూడేళ్ల పాలనలో మద్యం రేట్లు మూడు వందల శాతం పెంచారంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.. ఇక, మంత్రివర్గ విస్తరణలో సత్య సాయి జిల్లాకు సీఎం వైఎస్ జగన్ అన్యాయం చేశారని విమర్శించారు.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అసలు 8 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదన్న ఆయన.. ఆయా జిల్లాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి అనుభవించే అర్హత కూడా లేకుండా పోయిందన్నారు. నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు జగన్ వ్యవహారం ఉందని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ కి తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు తులసిరెడ్డి.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా భారీ సాయం