RTC Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. కాసేపట్లో ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని చార్జీలు మోత మోగుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా వరుసగా అన్ని చార్జీలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా పెట్రో చార్జీల పెంపు ప్రభావం అన్నింటిపై పడుతోంది.. ఇప్పటికే తెలంగాణలో ఈ మధ్యే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు వడ్డించారు.. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఇది తప్పలేదని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్టీసీ చార్జీల వడ్డనకు రంగం సిద్ధం అయ్యింది.. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది.. బస్సు ఛార్జీల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్టీసీ అధికారులు.. ఆమోదం కోసం వారం క్రితమే సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపించారు.. అయితే, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ ఛైర్మన్, ఆర్టీసీ ఎండీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో.. ఇక, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పెరిగిన పలు రకాల చార్జీలపై విపక్షాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
Read Also: Harish Rao: భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్.. ఏం చూసి ఓట్లు వేయాలి..!
Also Read
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
అనాధికారిక సమాచారం ప్రకారం.. కనీస ఆర్జినరీ బస్సుల్లో టికెట్ ధర రూ.5 ఉండగా.. దానిని రెట్టింపు చేసే అవకాశం ఉంది.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉన్న కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కు పెంచనున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస టికెట్ ధర రూ.45 కాగా రూ.60కి చేరే అవకాశం ఉంది.. ఏసీ బస్సుల్లో కనీస ధర రూ.100కు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ చార్జీలు పెరగడం ఇది రెండోసారి.
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!