ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధా ఇద్దరూ క్రేజ్ ఉన్న నేతలే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. సాధారణంగా వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై ఆరోపణలు చేసుకోవడం మాములే. కొడాలి నాని నిత్యం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు కూడా. ప్రతిగా టీడీపీ నేతలు కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తుంటారు. కానీ కొడాలి నాని, రాధా అనుబంధంపై ఈ మాటల…
కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూజివీడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు గాంధీబొమ్మ సెంటర్లో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నూజివీడు గాంధీ బొమ్మ…
కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని.. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు…
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, భోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు అమలు కోసం ఆస్పత్రుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసింది. డ్యూటీకి వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే సెలవుల్లో కోత ఉంటుందని ఏపీ ప్రభుత్వం…
శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలకు ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకుండా తన ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తానని…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.. అధికార, ప్రతిపక్ష నేతలు ఇలా అంతా పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పవన్ కళ్యాణ్ ఎటూకాకుండా తలతిక్కతనంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.. బీజేపీ, వైసీపీ భార్య భర్తలు పెళ్లి చేసుకోకుండా ఎలా కాపురం చేస్తారో ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ శ్రేణులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి… తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా నేను ఓడిస్తానని ప్రకటించారు.. కాకినాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్.. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. వాస్తవాలు తెలుసుకుని నా గురించి మాట్లాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఆయన.. జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు తెలుగు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత… వైసీపీ నేతలు కాలకేయుల మాదిరి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న ఆమె… మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. ఈ మూడేళ్లలో మహిళలపై 1500కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగితే ఏం…
గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ.. అందరికీ అభినందనలు తెలిపారు.. ఇక, గతంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని.. స్థానిక సంస్థలు అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే సభ్యులకు బాధ్యతను గుర్తు చేయాలని సీఎం సూచించారని.. అందుకే ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ట్రైనింగ్…
తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఉత్తరా౦ధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న.. రాష్ట్ర ప్రజలంతా ‘జే’ టాక్స్ కడుతుంటే… విశాఖ ప్రజలు ‘వీజే’ టాక్స్ కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారన్న ఆయన.. సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ప్రజాదర్బార్ పెడితే ఆయనకి తెలిసినవి, తెలియకుండా విజయసాయి రెడ్డి…