గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధిస్తాం…రాష్ట్రానికి.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మంచి పేరు తీసుకొస్తాను అని వెల్లడించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు… సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. 2026 వరకూ పాత జిల్లాల్లోనే జెడ్పీలను కొనసాగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పంచాయితీల్లో తాగునీరు పారిశుద్ధ్యం మెరుగు పరుస్తామని తెలిపారు.. 1988లో వార్డు మెంబర్‌గా గెలుపొందాను.. ఆ స్థాయి నుంచి ఈ స్ధాయికి వచ్చాను.. రాష్ట్రానికి.. సీఎం జగన్‌కి మంచి పేరు తీసుకొస్తాను.. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధిస్తాం అన్నారు.. ఇక, కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని.. పంచాయితీల్లో రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు రూ. 1072 కోట్ల త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు.
Read Also: YS Jagan: కడప, కర్నూలులో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..