నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మద్యం స్కాం బయటపడింది. జిల్లాలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. నకిలీ స్టిక్కర్లతో ప్రభుత్వ వైన్ షాపులకు గోవా లిక్కర్ సరఫరా అవుతోంది. కొందరు అక్రమార్కులు గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకు తారు ట్యాంకర్ల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ స్కాం…
టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు లాక్కున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ఎలాంటి ప్రేమ లేదని.. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరే పార్టీ లాక్కుంటారని.. మీరే వెన్నుపోటు పొడుస్తారని.. మీరే మళ్లీ ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తారని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.…
ఏపీలో సినిమా టిక్కెట్లకు సంబంధించి జగన్ సర్కారు మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచిన ప్రభుత్వం త్వరలోనే ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ టిక్కెట్ల వెబ్సైట్ నిర్వహణ టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ బిడ్డింగ్‌లో రెండు సంస్థలు పాల్గొనగా జస్ట్ టిక్కెట్స్ సంస్థకు టెండర్ దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి…
ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. చట్టంలో కొన్ని నిబంధనలను సవరించడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసుకుంది.. దరిమిలా ఎల్ఐసీ వంటి కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను (ఐపీవో మార్గంలో) ముక్కలు, ముక్కలుగా అమ్మకానికి పెడుతోంది. మరికొన్నింటిని హోల్‌సేల్‌గా అమ్మేస్తోందని విమర్శించారు.. పెట్టుబడుల ఉపసంహణకు ప్రతిపాదించిన 36 ప్రభుత్వరంగ సంస్థలలో ఇప్పటికే 8 సంస్థలలో ఈ…
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కాగ్ నివేదిక ఆధారంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కాగ్ నివేదిక ఆధారంగా యనమల చేసిన విమర్శలను తిప్పిగొట్టిన ఆయన.. వివిధ పద్దుల్లో అవకతవకలున్నాయని యనమల విమర్శించడం అన్యాయం అన్నారు.. రూ.48 వేల కోట్ల అవినీతి అంటూ యనుమల అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. నిధుల వినియోగం పై కాగ్ అడిగిన అభ్యంతరాలకు…
నష్టాల సాకు చూపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను బలి చేస్తారా అంటూ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి… ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థల ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు వలన ఆంధ్రప్రదేశ్…
కరోనా మహమ్మారి విజృంభణతో భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా వికలాంగులు, వయో వృద్ధులకు శుభవార్త చెప్పింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకీ 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక…
విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో…
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు…
ఆంధ్రప్రదేశ్‌లో నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపుతోంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)… రాష్ట్రవ్యాప్తంగా గత 16 రోజుల్లో భారీ ఎత్తున నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు చేస్తోంది.. ఆపరేషన్ పరివర్తన్-2.0లో భాగంగా నాటు సారా స్థావరాలపై దాడులు కొనసాగిస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 3,403 నాటుసారా కేసుల నమోదు చేసిన అధికారులు, 2,066 మందిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.. ఇక, 44 వేల లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 155 వాహనాలను సీజ్ చేసింది ఎస్ఈబీ.. 16…