తిరుమలలో శ్రీవారి దర్శనానికి వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల టీటీడీ ప్రకటించింది. అందుకు సంబంధించి గురువారం నాడు దర్శన టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టోకెన్ల జారీని టీటీడీ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది. ఆయా టోకెన్లను ఏప్రిల్ 8వ తేదీ ఉ.11 గంటలకు టోకెన్లు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ ఉ.10 గంటలకు,…
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన విషయం తెలిసిందే.. మరోవైపు… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం అయ్యింది.. దీనికి కాసేపటి కిత్రమే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. వర్చువల్‌గా సమావేశమైన ఏపీ కేబినెట్..…
విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఏడు దశల్లో ప్రజలపై…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా వడ్డింపుల పర్వానికి తెరలేపాయి.. ఇప్పటికే ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా… ఓవైపు పెట్రో ధరల పెంపుతో సతమతం అవుతున్న వాహనదారులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగులనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి టోల్ ట్యాక్స్ అనుసరిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ టోల్ ప్లాజాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. తేలికపాటి వాహనాల సింగిల్ జర్నీ కి టోల్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది… అసెంబ్లీ లోపల, బయట అనే తేడాలేదు.. విషయం ఏదైనా.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతారా? అంటూ నిలదీసిన ఆయన.. చంద్రబాబు…
ప్రజలపై క్రమంగా భారం మోపుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు… ఇలా అవకాశం ఉన్న ప్రతీది వడ్డించేస్తున్నారు.. ఇప్పటికే తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. కరెంట్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయం తీసుకుంది. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చింది ఈఆర్సీ.. వాటి ప్రకారం.. 30 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్‌కు…
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని టీడీపీ అంటోందని.. అంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కామెంట్లకు వైసీపీ నేతలు భయపడాల్సిన అవసరం…
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం…
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీతో పాటు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకు ఆత్మగౌరవాన్ని సంపాదించిపెట్టిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీడీపీ 40 వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని కూడా ఆయన…