ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ ప్రకటించిన తర్వాత… ప్రజలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.. ఇప్పటికే టీడీపీ, వామపక్షాలు, బీజేపీ విద్యుత్ ఛార్జీలపై పోరాటానికి దిగుతుండగా… ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇందులో చేరింది.. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న ఆయన.. ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్…
కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జైలు శిక్ష బదులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు ఏయే జిల్లాలలోని హాస్టళ్లలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలో హైకోర్టు తీర్పు కాపీలో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల్లోని హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు ఏడాది పాటు సేవలందించి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. ఈ ప్రకారం 8 మంది ఐఏఎస్‌లకు 8 జిల్లాల కేటాయింపు…
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపును వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో హేతుబద్దంగా స్వల్పంగా మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే తక్కువగా ఉన్నాయని సజ్జల అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. అయితే విద్యుత్…
ఆంధ్రప్రదేశ్‌లో తరచూ పొరుగు రాష్ట్రాల మద్యం పట్టుబడుతూనే ఉంది… ఏపీలో లిక్కర్ ధరలు కాస్త అధికంగా ఉండడంతో.. కొందరు కేటుగాళ్లు పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు.. అయితే, నెల్లూరులో గోవా మద్యం వ్యాపారం వెనుక వైసీపీ నేతలున్నారు అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ప్రధాన ఆదాయ వనరుగా మద్యాన్ని మార్చుకుని పాలన సాగించే పరిస్థితికి రావడం దురదృష్టకరమన్న ఆయన.. మద్యం పేరుతో స్లోపాయిజన్ అమ్మి ప్రజల…
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి.. అయితే, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది..? ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఎంత వరకు నిజం ఉంది ? అనే విషయాలపై మీడియాతో మాట్లాడిన ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వేసవి కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 230…
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా అని నిలదీశారు. గతంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశంపార్టీనే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.…
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు క్షమాపణలు కోరడంతో జైలుశిక్షను తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఒకరోజు సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయవద్దన్న…
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి స్పందించారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఏపీని అవినీతి ప్రదేశ్, అంధకారప్రదేశ్‌గా మారుస్తున్న గొప్ప వ్యక్తి జగన్ అంటూ ఏపీ బీజేపీ…
కాంగ్రెస్ పార్టీపై రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానంటూ ఛలోక్తులు విసిరారు. ఇక, తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను,…
సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… ఉగాది కానుకగా పేద, మధ్య తరగతిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని.. ఇది పెను భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏడు సార్లు పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్న ఆయన.. ఎమ్మెల్యేలు గానీ,…