ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ నెల్లూరులో పర్యటించారు.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు.. అయితే, సీఎం వైఎస్ జగన్.. నెల్లూరు జిల్లా పర్యటనలో భద్రతా…
ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. కొత్త మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం జగన్‌కు ఉన్న విశేష అధికారం అని.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలు శిరసావహిస్తారని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోందని.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీని గెలిపిస్తారని ధీమా…
కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం.. అంటే వారానికి నాలుగురోజుల పాటు గన్నవరం నుంచి కడపకు విమాన సర్వీసులు నడుస్తాయని ఇండిగో అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇండిగో, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు కడప నుంచి విజయవాడకే కాకుండా హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు కూడా విమాన సర్వీసులను నడుపుతామని ఇండిగో…
ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జూన్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంఆ వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ పూర్తి చేసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ…
ఒక్కొక్కరికి ఒక్కో అభిమానం ఉంటుంది. కొందరికి సినిమా స్టార్లు అంటే పిచ్చి. ఇంకొందరికి రాజకీయ నేతలంటే అభిమానం. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. దీంతో కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్…
తిరుమలలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉచిత బస్సులో (శ్రీవారి ధర్మరథం) మంటలు చెలరేగాయి. శ్రీవారి సేవకులను బస్సులో తిరుపతి నుంచి తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అయితే మంటలను సకాలంలో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశాడు. అనంతరం ఆ తర్వాత బస్సులోని శ్రీవారి సేవకులు వాహనం నుంచి…
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్‌లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం…
ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు…
చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా ఎలా మారుస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మండిపడ్డారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చారన్న ఆయన.. 1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదన్నారు.. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చే లేదు.. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలా..? పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టులు…