Kakinada: కాకినాడలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి (జీజీహెచ్) లోని స్కూల్ ఆఫ్ నర్సింగ్లో జీఎన్ఎం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ధర్మ తేజ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది.
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది భవానీల సంఖ్య పెరుగుతుంది. ఇరుముడులను సమర్పించేందుకు మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ( డిసెంబర్ 11న) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అజెండాలోని పలు కీలక అంశాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలపనున్నారు.
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..! ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర…
కడప మాజీ మేయర్ సురేష్ బాబుకి హైకోర్టు షాక్ కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది.. మాజీ మేయర్ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేయర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 4న ఎన్నికల సంఘం నోటిఫికేషన్…
Deputy CM Pawan: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన మాటామంత్రి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లెటూర్లు దేశానికి వెన్నుముక అందుకే పంచాయితీ రాజ్ శాఖ తీసుకున్నా.. సర్పంచ్ లే గెలిచాక మాట వినకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా వింటారు.
Kodali Nani: సుదీర్ఘ విరామం తర్వాత.. క్రియశీల గుడివాడ రాజకీయాల్లో మాజీమంత్రి కొడాలి నాని ప్రత్యక్షమైయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నారు.
CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు, హెచ్వోడీలు, సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు.
Students Missing: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. రాంబిల్లి BCT ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు తెలిపారు.