Kurnool Kandhanathi: రాయలసీమలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో పాతకక్షలు హింసాత్మకంగా మారాయి. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ అనే వ్యక్తిని పొలంలో, పరమేష్‌ను ఇంట్లో ప్రత్యర్థులు హత్య చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో శివారులో కాపు కాచి గోవింద్ (45), వీరేషమ్మ దంపతులపై వేటకొడవళ్లతో దాడి జరిగింది.
Gas Leakage: కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్.. భయాందోళనలో గ్రామస్తులు..
ఈ ఘటనలో వీరేషమ్మ కుమారుడు ఐదేళ్ల బాలుడు లోకేంద్రకు తీవ్ర గాయాలు కాగా.. గోవింద్ భార్య వీరేషమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోవింద్ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది ఇంటి వద్ద కుళాయి నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో కేసన్న వర్గానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఆ ఘటనకు ప్రతీకారంగానే ఇవాళ ఈ దాడి జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం కందనాతి గ్రామంలో పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.