* నేడు ఖమ్మం కార్పొరేటర్లతో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం.. ఖమ్మం పట్టణ అభివృద్ధిపై ప్రధానంగా చర్చ..
* నేడు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్.. మున్సిపల్, కార్పొరేషన్ ఓటర్ల సవరణపై చర్చ.. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్చ..
* నేడు ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ సర్పంచులకు సన్మాన కార్యక్రమం..
* నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి..
* నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించనున్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరే అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
* నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం.. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు ఉదయం 8.45 గంటలకి సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించనున్న డిప్యూటీ సీఎం పవన్..
* నేటి నుంచి రాజధాని అమరావతి రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం.. వడ్లమాను, యాండ్రాయి గ్రామాల్లో మొదటి రోజు సమీకరణ.. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నారాయణ..
* నేడు విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్.. పరువు నష్టం దావాలో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరుకానున్న మంత్రి..
* నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ..
* నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ.. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు.. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేసిన నిర్మాతలు.. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన నిర్మాతలు.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరిన నిర్మాతలు.. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపిన చిత్ర నిర్మాతలు..