* నేడు హిల్ట్ పాలసీ.. తెలంగాణ రైజింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ.. ఇవాళ రెండు అంశాలపై చర్చ పెట్టిన స్పీకర్..
* నేడు జనగామలో కేటీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ సర్పంచుల సన్మానానికి హాజరుకానున్న కేటీఆర్..
* నేడు తెలంగాణ భవన్ లో సమాంతర అసెంబ్లీ సమావేశం.. అసెంబ్లీలో జరిగే చర్చలపై కౌంటర్ ఇవ్వనున్న బీఆర్ఎస్..
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నూతన బీఆర్ఎస్ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు..
* నేడు సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పర్యటన.. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్న జగ్గారెడ్డి..
* నేడు ఆదిలాబాద్ జిల్లాలో సోయా బీన్ రైతుల బంద్.. సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్.. సోయా రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్..
* నేడు ఎస్ఐపీబీ, సీఆర్డీఏ అథారిటీ సమావేశాలు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశాలు..
* నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఉదయం 8:30కి మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి బయలుదేరనున్న పవన్.. ఉదయం 9:15కి సెక్రటేరియట్‌కు చేరుకోనున్న పవన్.. ఉదయం 9:15కి సచివాలయంలో అధికారులతో సమావేశం.. పలు సమావేశాల్లో పాల్గొనున్న డిప్యూటీ సీఎం.. మధ్యాహ్నం 12:30కి సచివాలయం నుంచి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి తిరిగి వెళ్లనున్న పవన్ కళ్యాణ్..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 13 గంటల సమయం..
* నేడు తిరుమలలో శ్రీవారి ఆలయంలో 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇవాళ స్థానికులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ..