ONGC Pipeline Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు బ్లో అవుట్ కొనసాగుతున్నాయి. మల్కిపురం మండలం ఇరుసుమండలోని బావిలో నుంచి భారీగా లీక్ కావడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో ఈరోజు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. వాటర్ అంబరిల్లాలతో నాలుగు వైపుల నుంచి నీళ్లు విరజిమ్మి మంటలు అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పైపులను నరసాపురం నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 16 గంటలుగా ఏకధాటిగా బ్లో అవుట్ కొనసాగుతుంది.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. 24 గంటల్లో రెండో ఘటన
అయితే, అవసరమైన పైప్ లైన్లను ఇతర సామాగ్రిని రాజమండ్రి, నరసాపురం నుంచి ఓఎన్జీసీ అధికారులు తీసుకుని వస్తున్నట్లు తెలుస్తుంది. ఘటన స్థలానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఇక, కోనసీమను చమురు, సహజ వాయు నిక్షేపాలు వెలికితీత నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. తరచూ బ్లూ అవుట్స్ స్థానిక ప్రజలకు భయ పెడుతున్నాయి. రాజోలు మండలం తూర్పుపాలెంలో కొమరాడ 1 డ్రిల్లింగ్ సైట్ లో 1993 మార్చి 20వ తేదీన బ్లో అవుట్ ఏర్పడింది. మంటలు వ్యాపించడంతో వేల కొబ్బరి చెట్లు దగ్ధమైయ్యాయి. 26 రోజులు తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్ తో బావి మూసివేశారు.
Read Also: Mana Shankar Varaprasad Garu: మన శంకర్ వరప్రసాద్ గారు… దుమ్ము రేపేస్తున్నారు
అలాగే, 1995 జనవరి 8వ తేదీన డ్రిల్లింగ్ సమయంలో బ్లో అవుట్ రావడంతో అల్లవరం మండలంలోని దేవరలంక పాశర్లపూడి 19 బావిలో 65 రోజులు పాటు మంటలు ఎగసిపడ్డాయి, అనంతరం బీఓపీ మూసివేసేశారు. 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ బ్లో అవుట్ కారణంగా ఆరు రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక, 2014 జూన్ 27వ తేదీన మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ కి చెందిన ట్రంక్ లైన్ లో విస్పోటనం చెందడంతో 22 మంది మృతి చెందగా, 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడిలో డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ పేలుడుతో మూడు రోజులు తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.