Pawan Kalyan: డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో జరిగిన బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని జిల్లా కలెక్టర్‌తో పాటు రాజోలు ఎమ్మెల్యేకు స్పష్టమైన సూచనలు చేశారు.ఇరుసుమండ గ్రామ పరిధిలోని మోరి నంబర్ 5 ఓఎన్జీసీ (ONGC) సైట్‌లో గ్యాస్ లీక్ కారణంగా చోటు చేసుకున్న బ్లో అవుట్ ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రమాద ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలను ఖాళీ చేయించినట్లు, అలాగే సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.ఇదే సమయంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌తో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, పరిసర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సోషల్ మీడియాలో వదంతులు, భయాందోళన కలిగించే ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Off The Record: కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి మళ్లీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం రీస్టార్ట్..!
అలాగే సమీపంలోని కొబ్బరి తోటలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.సహాయక శిబిరాల్లో ఉన్నవారికి అవసరమైన ఔషధాలతో పాటు, శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు కూడా అందించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.