2019లో జగన్ సీఎం అయ్యాక రెండున్నరేళ్ల అనంతరం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ కేబినెట్ చివరి సమావేశం జరుగుతోంది. మంత్రులకు ఇదే చివరి సమావేశం. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సీఎం జగన్‌వి ఉన్నత ప్రమాణాలు అని ప్రశంసించారు. సీఎం జగన్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశానని మంత్రి సురేష్ తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం తనకు గొప్ప అవకాశం…
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో మార్పులు, 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ చివరి భేటీలో చర్చించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కూడా చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం మంత్రులందరికీ…
విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా.. ఈ దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని పేర్కొన్న సీఎం జగన్.. గతంలో దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని…
మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఇక, ముగ్గురు, నలుగురు మినహాయిస్తే కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఎవరు ఉంటారు.. ఎవరు కేబినెట్ నుంచి పార్టీ బాధ్యతల్లోకి వెళ్లినున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు.. ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని…
ఈ మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇవాళే ఏపీలో పాత మంత్రులంతా రాజీనామా చేస్తారని తెలుస్తోన్న తరుణంలో.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే 90 శాతం మంత్రులను మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉండేది ఎవరు..? ఊడేది ఎవరు..? కొత్తగా వచ్చేది ఎవరు..? ఎవరికి ఏ శాఖ..? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, మా తలరాతలు మార్చేది సీఎం జగనే అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… ఇన్నాళ్లూ మంత్రిగా చేయడం నా అదృష్టంగా తెలిపారు.. రాజీనామా చేయమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఆయన కాళ్ల ముందు తల వంచి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ మంత్రిగా అవకాశం కల్పిస్తారనే…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగబోతోంది.. ఒక రకంగా ఇదే చివరి కేబినెట్.. ఈ సమావేశం తర్వాత ముగ్గురు, నలుగురు మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ భేటీలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదన్న ఆయన.. ఎల్లకాలం వైఎస్ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక.. డిప్యూటీ సీఎం పదవి…
ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆ దిశగా దూకుడు పెం చుతోంది. ఈనెల 20వరకు వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పోరు యాత్రకు సిద్ధం అయింది. 500 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేది బీజేపీ వాదన. ప్రతిపాదిత పనులు చేపడితే ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుందని…
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో…