తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లోనే ఆగిపోయింది. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముఖ్యంగా ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణిస్తున్న మహిళల…
దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్ల…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచారు.. ఓవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించిన ఆయన.. పాత మంత్రుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఎవ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి.. కొత్తవారు ఎవరైనా మంత్రులుగా బెటర్, సామాజిక సమీకరణలతో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే విషయాలపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులు నుంచి బహిరంగ సభల్లో విమర్శల ధోరణి మార్చారు. హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత విపక్ష…
* నేడు అవిశ్వాస తీర్మానంపై పాక్ నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న ఇమ్రాన్‌ఖాన్ * తిరుమలలో నేటి నుంచి వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు పునరుద్ధరణ * దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ రేపటి నుంచి బూస్టర్ డోస్ * నేటి నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. 10 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు * మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతోన్న సీఎం వైఎస్ జగన్ కసరత్తు.. ఇవాళ మరోసారి సజ్జలతో భేటీ అయ్యే…
గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్లో మాంసాహారం వండిన ఘటన కలకలం రేపింది. ఇది సున్నితమైన అంశం కావడం, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆలయంలోని క్యాంటీన్ మూసివేసి, దాన్ని లీజుకు తీసుకున్న నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాంసాహారం బయటే వండారని, దానికి సంబంధించిన రిక్షా ఆలయ ప్రాంగణంలోకి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై గురువారమే నిర్వాహకులకు…
‘అధికారాంతమున చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్’ అని ఓ పద్యంలోని మాటలు అక్షర సత్యాలని ఏపీలో రుజువైంది. పదవిలో ఉన్న వాళ్ళ కోసం జనం పడిగాపులు పడతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల డోర్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తుంటారు. సహాయం కోసమో సిఫార్సు కోసమో వచ్చే వాళ్ళతో మంత్రుల ఇళ్ల వద్ద నిత్యం జాతర వాతావరణం కనిపించేది. అదే నాయకుడికి పదవి ఊడిపోతే ఇందుకు పూర్తి రివర్స్ సీన్ కనిపిస్తుంది. సరిగ్గా ఇటువంటి వాతావరణమే ప్రస్తుతం…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే కీలుబొమ్మ తరహాలో మంత్రి వర్గాన్ని బలి పశువును చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మంత్రుల నుంచి సీఎం జగన్ ఎందుకు రాజీనామాలు కోరారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి బురదను కడుక్కోవాలంటే ఈ రాజీనామాలు సరిపోవని యనమల వ్యాఖ్యానించారు. విధ్వంసక విధానాలు పాటిస్తోన్న జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి…
వేసవి కారణంగా దేశమంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో తీవ్రమైన కార్చిచ్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇంధనం, పర్యావరణం, నీటి వనరుల పర్యవేక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశంలో 30 శాతం జిల్లాల్లో తీవ్ర కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఒడిశాలోని కుందమాల్ జిల్లాలకు కార్చిచ్చుల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది. వరదల నుంచి అనావృష్టికి, అనావృష్టి నుంచి వరదలకు…
ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేశారు. దీంతో ఈనెల 11న కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈనెల 10న కొత్త మంత్రుల పేర్లను సీఎం జగన్ గవర్నర్ దగ్గరకు పంపించే అవకాశాలున్నాయి. అయితే కొత్త మంత్రివర్గంలో చేరబోయేది ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా ఆశావాహులు తమకే మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనం ఓ లుక్కేద్దాం. ★ శ్రీకాకుళం జిల్లా ఔట్: ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు ఆశావహులు:…
ఏపీలోని శ్రీసిటీలో భారీ పరిశ్రమ కొలువుదీరనుంది. జపాన్ ప్రపంచ నంబర్‌వన్ ఏపీ కంపెనీ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సంస్థకు దేశంలోనే ఇది మూడో ప్లాంట్ కాగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం మొదటిది కావడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు డైకిన్ సంస్థ వెల్లడించింది. భారీ…