గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి నుంచే అల్పాహారం, అన్నదానానికి భోజనం సరఫరా అవుతాయి. అదే క్యాంటీన్లో మాంసాహారం వండటం విమర్శలకు దారితీసింది. ఇటీవల ఓ వ్యక్తి వేలంపాటలో క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నాడు. అతడి దగ్గర నుంచి అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త లీజుకుని తీసుకుని ఇప్పుడు ఈ క్యాంటీన్‌ను నడుపుతున్నట్లు…
ఏపీలో పరిశ్రమలకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్ మాత్రమే వాడుకోవాలని సూచించారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వీక్లీ హాలీడేకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడే పాటించాలని పరిశ్రమలను యాజమాన్యాలకు సీఎండీ కోరారు.…
★ నేడు నంద్యాలలో సీఎం జగన్ పర్యటన ★ నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల.. 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ ★ తిరుమల: నేటి నుంచి టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల.. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఏప్రిల్ నెల కోటా రోజుకు వెయ్యి చొప్పున విడుదల ★ ఏపీలోని అన్ని జిల్లాలలో నేటి…
ఏపీలో త్వరలో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు ప్రస్తుత కేబినెట్ సభ్యులు గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు. అయితే మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ కేబినెట్లోని 24 మంది అసమర్థులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారని ఆయన విమర్శలు చేశారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా ఓ…
ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు (ఏప్రిల్ 8) నంద్యాలలో పర్యటించనున్నారు. ఎస్పీజీ గ్రౌండ్ నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో నంద్యాలకు బయలుదేరనున్నారు. ఉదయం 11:10 గంటలకు నంద్యాల గవర్నమెంట్ డిగ్రీకాలేజీకి చేరుకుంటారు. ఉదయం 11:35- 12:35 గంటల మధ్య ఎస్పీజీ గ్రౌండ్‌కి చేరుకుని జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో…
ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేయడంతో కొత్త కేబినెట్లో ఎవరు ఉంటారన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కేబినెట్లో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని సాగనంపాలి అనేది సీఎం జగన్ ఇష్టమని, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మంది కేబినెట్లో తాను ఉంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీని…
అమరావతి: మంత్రిగా తన చివరి మీడియా సమావేశంలో పేర్ని నాని పలు విషయాలపై చర్చించారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్ని నాని తెలిపారు. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలే మారిపోయినట్లు వెల్లడించారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరాలంటే ఆలోచించేవాళ్లు అని.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్…
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని సీఎం జగన్ రాజీనామా చేసిన మంత్రులతో వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ ఓడించాలని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబును మరోసారి ఓడించే బాధ్యత మీదేనని, మళ్లీ ఓడితే చంద్రబాబుకు రాజకీయ జీవితం ఉండదని రాజీనామా చేసిన మంత్రులతో జగన్ చెప్పారు. రెండున్నరేళ్లు మంత్రివర్గంలో కొనసాగారని, ఇక నుంచి పార్టీ కోసం సేవలు వినియోగించుకుంటానని చెప్పారు. అందరికీ జిల్లాల్లో పార్టీ…
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులందరూ రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. కాగా అనుభవం రీత్యా కొంతమంది మంత్రులను కొనసాగిస్తున్నట్లు జగన్ చెప్పారని కొడాలి నాని వెల్లడించారు. కానీ ఎవరిని కొనసాగిస్తున్నారో చెప్పలేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఐదారుగురు మంత్రులు కొత్త కేబినెట్లో ఉండే అవకాశం ఉందన్నారు. కొత్త కేబినెట్లో తాను ఉండే అవకాశం తక్కువ అని కొడాలి నాని పేర్కొన్నారు. జగన్ ఏ బాధ్యత…
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. అసూయకు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయన్న జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్న లాంటి వాడు సీఎం జగన్ మోహన్ రెడ్డేనని. అందుకే నాన్న, బాబాయ్‌కు టికెట్ తీసి పంపేశాడని లోకేష్ ఆరోపించారు. మరోసారి సీఎం జగన్ అసూయతో గర్వం దాల్చాడని.. ఈ సారి గుండెపోటు తల్లికో.. చెల్లికో..? అంటూ…