మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాము ఎవరి పల్లకీలను మోయడానికి లేమని స్పష్టం చేశారు. ప్రజలను పల్లకిలోకి ఎక్కించేందుకే జనసేన ఉందన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు చూసి భరించలేక వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానని.. దానికి వైసీపీ నేతలు ద్వంద్వర్థాలు తీస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించే అన్నాను. వైసీపీ చేస్తోన్న…
శ్రీకాకుళం జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. కంచిలి మండలం జడిపుడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. తొలుత అతడు గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు…
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీతో జగన్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55,548.87 కోట్లుగా నిర్ధారించిందని.. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతపురం నుంచి పవన్ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లల్లో 1,857 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తొలి ఏడాది 1019 మంది, రెండో ఏడాది 838 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పవన్ తన పరామర్శ…
విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC…
ఏపీలో విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక సమాచారం అందించింది. రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం నాడు ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్, జూలై 13న ఎడ్‌సెట్, లాసెట్, పీజీఎల్‌సీఈటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అంతేకాకుండా జూలై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్, జూలై 22న ఈసెట్, జూలై 25న ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. కాగా ఈఏపీసెట్‌కు సంబంధించి జూలై…
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోల్ పెట్టారు. ఈ పోల్ ద్వారా జగన్ ఢిల్లీ దేనికోసం వెళ్లారని ఆయన ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ ఆయన పోల్‌ను పోస్ట్ చేశారు. ఈ పోల్‌లో తొలి…
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే గడపనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయనకు వైసీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ వరుసగా ప్రధానితో…
ఏపీ కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు అమల్లోకి రాగా.. త్వరలో మరో కొత్త జిల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాలన్నీ కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో కొత్త జిల్లా…
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని పదవులు అనుభవించిన చంద్రబాబు చేయని పనిని సీఎం జగన్ చేసి చూపించారన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరిందన్నారు. ఎన్టీఆర్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు…