ఏపీ తీరంలో అసని తీవ్ర తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. భయంకరమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అసని తీవ్ర తుఫాన్ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను అందుబాటులో ఉంచారు. అటు ఒంగోలు కలెక్టరేట్లో కూడా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266. చీరాల ఆర్డీవో కార్యాలయంతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో…
అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో ఈరోజు ప్రభుత్వం తలపెట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే తుఫాన్ కారణంగా ఈరోజు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని అధికారులు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను శుక్రవారం రోజే జమ చేయనున్నారు. కాగా గురువారం నాడు ఏపీ…
అసని తీవ్ర తుఫాన్‌గా మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని తీర ప్రాంతానికి ముప్పు ఏర్పడింది. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణశాఖ అంచనాలను తలకిందులు చేస్తూ అసని తీవ్ర తుఫాన్ తన దిశను మార్చుకుని కాకినాడ తీరం వైపుకు దూసుకువస్తోంది. దీంతో కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో అధికారులు గ్రేట్ డేంజర్ సిగ్నల్-10 జారీ చేశారు. అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి…
ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మంగళవారం నాడు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులుహైదరాబాద్లో అరెస్ట్ చేసి అనంతరం చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. అయితే పోలీసులు మోపిన అభియోగాన్ని మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. నారాయణ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి…
★ అసని తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో నేడు జరగాల్సిన ఇంటర్ పరీక్ష ఈనెల 25కి వాయిదా వేసిన విద్యాశాఖ అధికారులు ★ ఏపీలో నేటి నుంచి వైసీపీ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు ★ తిరుమల: నేడు రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు.. ఈరోజు అశ్వ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు.. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ ★ పల్నాడు జిల్లా: నేడు నర్సరావుపేటలో…
తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, ఇతర క్రిమినల్స్‌తో తనకు ప్రాణాపాయం ఉందని లేఖలో పేర్కొన్న అచ్చెన్న… ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4 కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నానన్న అచ్చెన్నాయుడు… రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా, టీడీఎల్పీ ఉప నేతగా వ్యవహరిస్తున్నందున…
అసని తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతోంది… ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వైపు అసని దూసుకొస్తుండడంతో ఆ ఎఫెక్ట్ తీర ప్రాంతాలపై పడుతోంది.. ఇక, రేపు తీరం దాటనున్న నేపథ్యంలో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది.. ప్రస్తుతం కాకినాడకు ఆగ్నేయ౦గా 210 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది అసని తీవ్ర తుఫాన్.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ముందుకు…
అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తోంది.. ఆ ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, అసని తుఫాన్‌పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశాపై ‘అసని’ తుఫాన్ ప్రభావం, దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధతపై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిగింది.. తుఫాన్ రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కాకినాడ-విశాఖపట్నం తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని.. కాకినాడ, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై…
అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగిపోయింది.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు.. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే, మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గడంతో.. పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసింది ప్రభుత్వం.. పరిశ్రమలకు విద్యుత్ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా…