★ తిరుమల: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. నేడు గజ వాహనం పై ఉరేగింపుగా రానున్న శ్రీవారు.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ ★ గుంటూరు: నేటి నుండి వాటర్ పైపుల మరమ్మతులు.. రెండు రోజుల పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్న కార్పొరేషన్ అధికారులు ★ నేడు తిరుపతి రూరల్ మండలంలో గంగ జాతర,…
ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసు సంచలనంగా మారింది.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన తేజస్విని మృతికేసును దిశ పీఎస్‌కు అప్పగించారు.. అయితే, ఈ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై విచారణ జరిపించాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం…
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేదేలేదని స్పష్టం చేశారు.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు భిగించాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.. ఆరు నెలల్లో ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావటంతో మోటార్లు ఏర్పాటులో వేగం పెంచింది ప్రభుత్వం.. దీనిలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు…
సింహం సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ జగనే సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో బలమైన ప్రభుత్వం ఉంది… ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. పొత్తులు పొత్తులు అని మాట్లాడుతున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు బట్టలు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయి.. సింహం సింగిల్ గానే…
నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పొదలకూరు మండలం తాటిపర్తిలో తుపాకీ కాల్పులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.. పెళ్లి చేసుకునేందుకు తనకి అమ్మాయిని ఇవ్వలేదనే అక్కసుతో కావ్య అనే అమ్మాయి (26)పై తుపాకీతో కాల్పులు జరిపాడు సురేష్ రెడ్డి అనే యువకుడు.. ఆ తర్వాత తనను తాను రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.. కాల్పుల్లో గాయపడిన కావ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందగా.. సురేష్ రెడ్డి కూడా ఆ తర్వాత మృతిచెందాడు. Read Also: Mahesh Babu: సితార టాలీవుడ్ ఎంట్రీ.. కన్ఫర్మ్…
కాకినాడ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మరోసారి ఎన్నికల పొత్తులపై చర్చకు దారితీశాయి.. దీనిపై విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి.. అయితే, కాకినాడలో తన కామెంట్లను వక్రీకరించారని తెలిపారు చంద్రబాబు. టీడీపీ ముఖ్య నేతలు, క్షేత్ర స్థాయి నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. వైసీపీవి డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు.. తన బలహీనతలను అధిగమించడానికి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తోందని మండిపడ్డారు. భీమిలి పర్యటనలో ప్రజలు…
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైసీపీ ఇంఛార్జి కొండారెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల-రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పులివెందుల-రాయచోటి మధ్య రోడ్డు పనులను కొండారెడ్డి అడ్డుకున్నారని.. చక్రాయపేట మండలంలో పనులు జరగాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు కన్స్ట్రక్షన్ సంస్థ కర్ణాటకలోని ఓ బీజేపీ…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనంతపురంలో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి వామపక్షాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పోరు గర్జనకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అటు సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమానికి వెళ్తున్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనంతపురంలో వామపక్షాల నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట…
నెల్లూరు జిల్లాలోని పెన్నా, సంగం బ్యారేజ్ పనులను సోమవారం ఉదయం మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యారేజీలకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని .. ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయని తెలిపారు. 30 శాతం పనులు చేసి టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కాకాణి…
పొత్తుల విషయంలో వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తూ టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేయడం తెలియదని, పొత్తు లేకపోతే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరని ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో వైసీపీ నేతల కామెంట్లపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైసీపీ పక్కన నిలబడేందుకు ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదని వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం…