ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘అసని’ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది.. మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీన పడిన ‘అసని’.. గత 6 గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడిందని.. కొన్ని గంటలు ఇదే ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ…
ఏపీలో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ అంశం మరో వివాదానికి దారి తీసింది. టెన్త్ ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాము అదుపులోకి తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేరమని.. ఈ విషయంలో సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఫోన్…
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్…
విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూంను పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కో షోరూంలో వస్త్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమ్మర్ శారీ మేళాకు తనను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలకు నచ్చేలా అన్నీ ఆప్కో షోరూంలలో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా ఆప్కో షోరూంలలో కొనుగోలు చేస్తూ ఆప్కో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత కార్మికులకు మనం సహాయం చేస్తేనే వాళ్లు అభివృద్ధి…
ఏపీలో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని వంగలపూడి అనిత ఆరోపించారు. జగన్ ఏపీలోని అక్క చెల్లెమ్మలతో ఓట్లు వేయించుకుని సీఎం అయ్యాక అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలకు ఎల్లప్పుడూ కామాయేనా.. ఫుల్స్టాప్…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా నారాయణ అరెస్ట్ అంశంపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పందించారు. ఏపీలో పాశవిక పాలన నడుస్తోందంటూ ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగానే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు. అయితే తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఎంతో కాలం నిలబడవని గోరంట్ల బుచ్చయ్య చౌదరి…
ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, వంట నూనెల ధరలు పెరిగి సామాన్యులను అష్టకష్టాలు పెడుతున్నాయి. అయితే తామేం తక్కువ కాదు అన్నట్లు చికెన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో కిలో చికెన్ ధర రికార్డులు తిరగరాస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.312కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అటు తెలంగాణలో కిలో స్కిన్…
ఏపీలో కడప జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా జగన్ ప్రచారం చేయించుకున్నారని.. సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే గన్ ఎక్కడా? జగన్ ఎక్కడా? అని లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. Crime…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ బలహీనపడుతోంది. మచిలీపట్నానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా నుంచి బలహీనపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మరికొద్ది గంటల తర్వాత ఇదే ప్రాంతంలో తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Breaking: తీరం దాటిన అసని తుఫాన్ వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 45-…
పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ తర్వాతే ఉద్యోగులకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11వ పీఆర్సీలో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పీఆర్సీ బకాయిలను ఇప్పటి వరకు PF, GPF ఖాతాల్లో జమ చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం రిటైర్మెంట్ తర్వాతే చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్ రికవరీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2020-డిసెంబర్ 2021 వరకు రావాల్సిన…