★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ★ చిత్తూరు: నేడు కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. శీగలపల్లె ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు ★ ఏపీలో నేడు ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ పరీక్ష ★ తిరుమల: నేటితో ముగియనున్న పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు.. నేడు గరుడ వాహనంపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు ★ నెల్లూరు: నేడు బిట్రగుంటలో డిప్యూటీ…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీరాన్ని దాటింది.. ‘అసని తుపాను’ తీవ్రవాయుగుండంగా బలహీనపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరం వైపుగా కదిలి మచిలీపట్నం – నరసాపురం మధ్య ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని దాటిందని ప్రకటించింది రాష్ట్ర విపత్తుల సంస్థ.. ఇక, రేపు ఉదయానికి అసని తుఫాన్ మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ విపత్తలు సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అసని తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మచిలీపట్నం…
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారు.. మిగిలిన రెండేళ్లు కార్యకర్తల్ని అక్కున చేర్చుకుని మంచి చేస్తే మరోసారి ఎమ్మెల్యేలు అవుతారన్న ఆయన.. లేక పోతే పుట్టగతులు కూడా ఉండవు అంటూ హెచ్చరించారు.. ఇక, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించబోనంటూ వార్నింగ్ ఇచ్చిన బాలినేని.. ఈ విషయంలో నాపై సీఎం వైఎస్ జగన్ కి ఫిర్యాదులు చేసుకున్నా భయపడేదిలేదన్నారు. Read Also: Telangana:…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది.. అయితే, అసని కదలికలో వేగం తగ్గింది.. నెమ్మదిగా కదులుతోందని విపత్తుల సంస్థ ప్రకటించింది.. అసని తుఫాన్‌పై తాజా బులెటిన్ విడుదల చేశారు ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్.. అసని రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొన్నారు.. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలిందని.. మూమెంట్ నెమ్మదిగా ఉందన్నారు.. ప్రస్తుతం మచిలీపట్నానికి 40 కిలోమీటర్లు, నరసాపురంకు…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ లెక్చరర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్య దేవుడిగా ప్రచారం చేసుకుంటున్న జగన్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా తయారయ్యాడని నారా లోకేష్ విమర్శించారు. Read Also: Nellore: సర్కారీ ఆస్పత్రిలో ‘శంకర్‌దాదా’లు..…
ఏపీలోని పలు జిల్లాల ప్రజలు అసని తుఫాన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అసని తుఫాన్ ప్రభావం ముఖ్యంగా కోస్తా జిల్లాలు, గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందన్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అసని తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు…
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దారుణం వెలుగుచూసింది. విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బందికి ధన్‌బాద్-అలిప్పి ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దీంతో బీ1 బోగీ టాయ్‌లెట్ వాష్బేసిన్లోకి వెళ్లి చూడగా తల్లి వెచ్చని పొత్తిళ్లలో ఉండాల్సిన అప్పుడే పుట్టిన మగబిడ్డ కనిపించాడు. ఈ విషయంపై ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. Read Also: CM Jagan: తుఫాన్ బాధితులకు రూ.2వేలు పరిహారం మెరుగైన వైద్యం కోసం మగశిశువును వెంటనే రైల్వే…
ఏపీని అసని తుఫాన్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అసని తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్‌గా సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు…
అసని తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫాన్‌గా మారింది. దిశను మార్చుకున్న అసని మచిలీపట్నానికి 50కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతుండగా.. నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకే అవకాశముంది. అనంతరం కాకినాడ దగ్గర సముద్రంలోకి వచ్చి బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా విశాఖకు రావాల్సిన, వెళ్లాల్సి ఉన్న అన్ని విమానాలను…