ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రేపటి నుంచి ఈ నెల 13 వరకు హర్యానాలోని పంచకులలో ప్రారంభం కానున్నాయి. 25 క్రీడావిభాగాల్లో మొత్తం 4,700 మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా.. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్‌తో పాటు ఇతర క్రీడలను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో నిర్వహించనున్నారు. అంబాల, షాహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీలోని మైదానాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి.
COMMONWEALTH GAMES 2022: మళ్లీ భారత్,పాక్ మ్యాచ్.. దాయాదుల పోరుకు రంగం సిద్ధం..
అంబాలా (జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్), షహాబాద్ (హాకీ), చండీగఢ్ (ఆర్చరీ, ఫుట్‌బాల్), న్యూఢిల్లీ (సైక్లింగ్, షూటింగ్) నగరాలలో జరిగే క్రీడలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొంటున్నాయి. ఆతిథ్య హర్యానా 398 మంది అథ్లెట్లతో కూడిన అతిపెద్ద బృందాన్ని కలిగి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ మహారాష్ట్ర 357 మంది అథ్లెట్లతో రెండవ అతిపెద్ద దళాన్ని రంగంలోకి దించగా, ఢిల్లీకి చెందిన 339 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు. కాగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 19 విభాగాల్లో వీరంతా ఎంపికైనట్లు అధికారులు వివరించారు.