గతంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి దంపతుల ఆలోచన విధానం మార్పులు వచ్చాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు చాలు అనుకుంటున్నారు. కొందరు అయితే ఒకరితోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఏపీలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఏపీలో సగటున ప్రతి 10 కుటుంబాలకు 17…
★ నేడు కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన.. ఐ.పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్ మత్య్సకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ ★ చిత్తూరు: నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన.. ఈరోజు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్న చంద్రబాబు ★ తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం ★ అనంతపురం: నేటి నుంచి పెన్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ★ నెల్లూరు: నేడు వెంకటాచలంలో గడప…
కొన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో మాత్రం వెనక్కి తగ్గడం లేదు సీఎం వైఎస్ జగన్.. కష్టకాలంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేసి లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సీఎం.. ఇప్పుడు మత్స్యకార కుటుంబాలకు శుభవార్త చెప్పారు.. రేపు మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు.. వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా సొమ్మును లబ్ధిదారులకు అందజేయనున్నారు.. కోనసీమ జిల్లా…
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. అయితే, ఇది కక్షపూరితమని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతుంటూ.. ఆధారాలున్నాయి కాబట్టే కేసులు పెడుతున్నాం, అరెస్ట్‌లు చేస్తున్నామని చెబుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరు నిర్వహిస్తోన్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ కుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు..…
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత ఆ వివరాలు, నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు.. వ్యవసాయ సీజన్‌ను ఎర్లీగా ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.. గోదావరి డెల్టాకు జూన్-1 నుంచి నీటిని విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. జూన్ ఒకటో తేదీ నుంచి కాల్వలకు నీళ్లు వస్తాయి.. రైతులు దీనికి అనుగుణంగా పంటలకు సమాయత్తం చేసుకోవాలని.. కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్…
ఓవైపు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో నడుస్తుండగా.. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ కూడా అదే తరహాలో కార్యక్రమాన్ని తీసుకున్నారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజలకు తుఫాను హెచ్చరికతో పాటు వైసీపీ నాయకులు వస్తున్నారు జాగ్రత్త అంటూ సెటైర్లు వేశారు.. వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తే జాలి పడే పరిస్థితి తెచ్చుకున్నారు.. ఎన్నికలు వస్తున్నాయని భయంతో గ్రామాల్లో గడపగడప తిరుగుతూ ఓట్లు అడుక్కునే పరిస్థితికి దిగజారాన్నారు. ఇక, వలంటీర్లను బ్లాక్ మెయిలర్లుగా తయారు…
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా చర్చించిన సీఎం… గడప గడపకూ మన ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్లు చేశారు.. ప్రతి మంత్రి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించిన ఆయన.. ఎవరైనా పథకాలు అందలేదంటే వారికి ఓపిగ్గా వివరణ ఇవ్వాలన్నారు. కొంతమంది ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అని పరోక్షంగా ప్రస్తావించిన సీఎం జగన్.. టీడీపీ మీడియాలో వచ్చే…
ఏపీ సర్కార్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 3 ఏళ్లుగా కాన్వాయ్ డబ్బులు ప్రభుత్వం బాకీ పడడం రాష్ట్రానికి అవమానమన్న ఆయన.. కాన్వాయ్ కోసం కార్లు పెట్టిన వారికి ప్రభుత్వం రూ. 17 కోట్ల బాకీ పడడం సిగ్గుచేటన్నారు.. వ్యవస్థల పతనానికి ఇది నిదర్శనం.. ఆందోళనకరం అన్నారు. పాలకుల వైఫల్యం అధికారులను, ఉద్యోగులను కూడా ఒత్తిడిలోకి నెట్టేస్తుందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. సీఎం కాన్వాయికు కార్లు పెట్టిన…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు బెయిలుపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.. సీబీఐ, నిందితుల తరపున వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.. అయితే, సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.. వివేకా హత్య కేసు వెనుక కుట్ర ఉందని తెలిపిన సీబీఐ.. జైలులో ఉండే నిందితులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని వాదించింది.. Read Also: North…
పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలి పోయిన ఘటన విశాఖలో కలకలం సృష్టించింది.. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పీఎం పాలెం సీఐ రవి కుమార్.. గుర్తు తెలియని విష పదార్థాన్ని సేవించడం వల్ల సృజన మరణించినట్టు చికిత్స చేసిన…