Rk Roja: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరింది.
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు.
Ambati Rambabu: ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంతో గొడప పడే అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృధ్ధి చేసే బాధ్యత నాది అన్నారు. ఇక, గోదావరి నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకుంటాం.
గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ మైన్సే నన్ను ఏం చేయలేదు.. జగన్ లాంటి వాళ్లు నన్ను ఏం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. తిట్లు, శాపనార్ధాలు నాకు తాకవు అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Minister Payyavula: పలేగాళ్ల రాజ్యం గురించి విన్నాం.. కప్పం గట్టమని పొలంలో పంటలు కోసుకుపోయారు.. పాలేగాళ్ల వంశానికి చెందినవాడు జగన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పాలేగాళ్ల రాజ్యం తిరిగి తీసుకురావాలని జగన్ చూస్తున్నారు.. చంద్రబాబు 100 రోజుల్లో 6 పంపుల నుంచి 12 పంపుల ద్వారా నీరు విడిచే విధంగా పనులు చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి…
ముతుకుమిల్లి శ్రీభరత్..... తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ. ఉద్దండులు గెలిచిన విశాఖ గడ్డ మీద రికార్డులు బ్రేక్ చేసిన నాయకుడు. రాజకీయ వారసత్వ పునాదుల ఆధారంగా 2019లో తొలిసారి పోటీ చేసిన శ్రీభరత్‌కు షాకింగ్ ఎక్స్పీరియన్స్ మిగిల్చారు విశాఖ ఓటర్లు. నాడు వైసీపీ ప్రభంజనం ఒకవైపు, జనసేన ఓట్లు చీలిక మరోకవైపు తీవ్ర ప్రభావం చూపి ఫస్ట్ అటెంప్ట్‌లో ఓడిపోయారాయన. అప్పట్లో... ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపుకంటే... భరత్ ఓటమిపైనే ఎక్కువ విశ్లేషణలు నడిచాయి.…
టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్... రాజకీయ ఉనికి కోసం మళ్ళీ తెలుగుదేశంలోకి.... ఆపై ఢిల్లీలో పట్టుకోసం వైసీపీలోకి జంప్. ఇలా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు, పార్టీలు మారుస్తూ... తన రాజకీయ ఉనికి చాటుకుంటుంటారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి...భూ సమీకరణ, భూసేకరణ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతి ప్రాంతంలో రెండో విడత భూసమీకరణ చేయాలనే ఆలోచనతో ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థానిక రైతులు సానుకూలంగా లేకపోవడంతో...రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్ పడింది.