Tirupati: తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న ఓ షాపు కాంట్రాక్టు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ అనిల్ రెడ్డి ఈ దౌర్జన్యానికి పాల్గొడిన్నట్టు పోలీసులు వెల్లడించారు.
Read Also: Mayasabha Review : మయసభ రివ్యూ
అయితే, షాపు కాంట్రాక్టుకు సంబంధించిన వివాదంలో అనిల్ రెడ్డి, అతడి మిత్రులు ఓ గిరిజన యువకుడిని గదిలో బందీంచి విచక్షణారహితంగా కొట్టే.. వీడియోలను వారి మిత్రులే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విజువల్స్ నెట్టింట బాగా వైరల్ కావడంతో.. దీనిపై విచారణ చేపట్టారు పోలీసులు. ఇక, అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధితుడి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలానికి చెందిన పవన్ గా గుర్తించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.