Nara Lokesh: గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలు అన్ని తెలుసుకున్నా.. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. యువగళంలోనే చేనేతను దత్తత తీసుకున్నా.. నేను ఎవరింటికి వెళ్ళినా.. వాళ్ళకి మంగళగిరి చీరలను ఇస్తున్నాను అని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణి కూడా మంగళగిరి చీరలు కట్టింది.. మంగళగిరి చేనేతలను మా గుండెల్లో పెట్టుకున్నా.. 53 వేల ఓట్లతో మెజారిటీ గెలిపించమని అడిగితే 90 వేల ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించారు.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే.. మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది.. రూ. 1000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చామని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Anushka : రెండేళ్లుగా హిట్ చూడని హీరో కోసం అనుష్క్ బయటకు వస్తుందా?
ఇక, 20 వేల ఇళ్లపై సూర్య ఘర్ కింద సోలార్ పవర్ పెడతామని మంత్రి లోకేష్ తెలిపారు. 100 పడకల హాస్పటల్ కడుతున్నాం.. 200 అభివృద్ధి పనులు మంగళగిరిలో నడుస్తున్నాయి.. చేనేతల నాయకుడు ప్రగడ కోటయ్య జయంతినీ అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని చేనేతలకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు, ఉప్పాడ, మంగళగిరి చేనేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారిని దత్తత తీసుకున్నాను పేర్కొన్నారు. ఎంతో మంది దానిని ఎగతాళి చేశారు.. కానీ, నేను అవి ఏమి పట్టించుకోకుండా చేనేతల అభివృద్ధికి కృషి చేస్తున్నాను.. దేశంలో మోదీ… రాష్ట్రంలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్.. మంగళగిరిలో మీ లోకేష్ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పటి నుంచి వాళ్లు వాళ్ళు చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులు అని సూచించారు.