రాయచోటిలో జరిగిన ఓ సంఘటన గుండెల్ని పిండేస్తోంది. కన్నతండ్రే బిడ్డల జీవితాలు నాశనమయ్యేందుకు కారణమయ్యాడు. ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకెళ్లాడా దుర్మార్గుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయచోటికి చెందిన హుస్సేన్ దినసరి కూలీ. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా.. కీలకమైన అలైన్మెంట్ అభ్యంతరాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫస్ట్ ఫేజ్ కింద 46.63కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరగనుండగా ఇందులో 20కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆసియాలోనే పొడవైన ఎలివేటెడ్ మెట్రోగా గుర్తింపు లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతోంది.. రాష్ట్రానికి పెట్టుబడులు, రాజధాని అమరావతి అభివృద్ధియే అజెండాగా సాగుతోన్న ఈ పర్యటనలో కీలక సమావేశాలు, చర్చలు, ఒప్పందాలు కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా బిజీగా గడపుతున్న చంద్రబాబు.. ఇవాళ నాల్గో రోజు కీలక సమవేశాలు నిర్వహించబోతున్నారు.. వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు..
మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం, ఓవర్ స్పీడ్ తో విన్యాసాలు చేస్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, చోద్యం చూస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మణికొండ మున్సిపాలిటీ. మణికొండ పుప్పాలగూడలో వాటర్ ట్యాంకర్లు అరాచకం సృష్టిస్తున్నాయి. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల్లోని నలుగురు ప్రమాదాలకు గురై చనిపోయారు, కనీసం పట్టించుకోకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చోద్యం చూస్తోంది. మణికొండ మున్సిపాలిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.…
Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది.…
Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.