Satavahana College: మరోసారి తెరమీదకి శాతవాహన కళాశాల వివాదం వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని ఆడియో కాల్ ను మీడియాకు విడుదల చేసి, సీపీకి ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. నా ఫోన్ సీఐడీతో ట్యాపింగ్ చేయిస్తున్నారని చెబుతున్నారు.. గతంలో ఒకసారి మా ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని ఆలపాటి బెదిరించారు.. వారం క్రితం ఆలపాటి నాకు ఫోన్ చేసి నన్ను వదలను అని హెచ్చరించాడు.. సీపీనీ కలిసి నన్ను రక్షించాలని కోరాను.. గతంలో ఒకసారి కూడా నన్ను కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకు వెళ్ళారు.. ఆ సమయంలో కూడా పోలీసులకి నా కుమారుడు ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి నన్ను విడిచి పెట్టారు అని శాతవహన కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Read Also: War 2 : ఎన్టీఆర్.. హృతిక్.. సలాం అనాలి.. ప్రోమో అదుర్స్
అయితే, ఈ విషయాన్ని CM దృష్టికి తీసుకెళ్లానని ఆలపాటి నన్ను బెదిరిస్తున్నారు అని శాతావహన ప్రిన్సిపల్ వంకాయలపాటి తెలిపారు. ఇప్పటికే, ఆయనపై నేను డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాను… శాతవాహన కళాశాల విషయంలో ఆలపాటికి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్టు వినాలని నన్ను పదే పదే బెదిరిస్తున్నారు.. అధికార పార్టీ కాబట్టి నేనేం చేయలేక రక్షణ కోసం పోలీసులని ఆశ్రయించాను.. నాకేమన్నా జరిగితే దానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కారణం అని వెల్లడించారు.